దడ పుట్టిస్తున్న చెన్నై రోడ్లు!

ప్రయాణిస్తున్న వాహనం ఒక్కసారిగా నేలలోకి వెళ్ళిపోవడం సహజంగా హాలీవుడ్ ఫిక్షన్ సినిమాలలో ఎక్కువగా చూస్తుంటాం. అలాగే గ్రాఫిక్స్ ప్రాధాన్యత గల సినిమాలలో కూడా ఇలాంటి చిత్రవిచిత్రాలు జరుగుంటూ ఉంటాయి. కానీ, అదే నిజజీవితంలో జరిగితే..! ఇంకేముంది… ఆ వైపుగా వెళ్ళాలంటేనే జనాలు భయపడిపోతుంటారు. ప్రస్తుతం చెన్నైలో ప్రజల పరిస్థితి కూడా అలాగే ఉంటోంది. నగరంలోని అన్నాశాలై రోడ్డు అకస్మాత్తుగా భూమిలోకి కుంగిపోవడం, ప్రజలను విస్మయానికి గురిచేస్తోంది.

దీంతో అదే సమయంలో రోడ్డుపై వెళ్తున్న ఆర్టీసీ బస్సు, కారు ఒకదానికొకటి డీ కొట్టుకుని భూమిలోకి దిగబడిపోయాయి. అదృష్టవశాత్తు సదరు వాహనాలలోని ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదం సంభవించలేదు. ఆదివారం సెలవు రోజు కావడం, మధ్యాహ్న సమయంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో వాహనాల రద్దీ తక్కువగా పెద్దగ లేకపోయింది. లేకుంటే పెద్ద ప్రమాదమే జరిగి ఉండేదని స్థానిక వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ADVERTISEMENT

రోడ్డుపై వెళుతున్న వాహనాలు ఒక్కసారిగా భూమిలోకి దిగబడిపోవడంతో వాహన చోదకులకు అసలేం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. అయితే ఈ రోడ్డు కుంగిపోవడం ఇదేమి తొలిసారి కాదు, ఇటీవల ఓ వారం రోజుల క్రితం కూడా దాదాపుగా ఇటువంటి సంఘటనే చోటుచేసుకుంది. ఆ రోడ్డు కింద పైపు లైన్ ఉండటంతో ఈ సంఘటనలు పునరావ‌ృతం అవుతున్నాయని, ఈ విషయమై అధికారులు దృష్టి సారించడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories