రోజాకు ‘జ్ఞానోదయం’ అయినట్లేనా..!

Roja ready for Opologyఅసెంబ్లీ వేదికగా టిడిపి ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేసి ఇప్పటివరకు అసలు తానూ ఏ విధమైన అసభ్య పదజాలాన్ని వినియోగించలేదని చెప్పిన రోజా కాస్త వెనక్కి తగ్గారా… అంటే… అవుననే అంటోంది రోజా. ‘అసెంబ్లీలో తాను చేసిన మాటలు అనితను బాధపెట్టి ఉంటే క్షమాపణ చెప్పేందుకు తానూ సిద్ధమేనని, అయితే టిడిపి వర్గీయులు కూడా తనకు ‘సారీ’ చెప్పాలని రోజా డిమాండ్ చేసారు. అయితే ఇదేదో అప్పుడే చేసినట్లయితే ఈ సస్పెన్షన్ కూడా ఉండేది కాదు కదా… అన్న సూక్తులు పొలిటికల్ వర్గాల్లో వినపడుతున్నాయి.

తానూ చేయని తప్పుకు నేను సారీ ఎందుకు చెప్తానని, అయినా రోజాకు నిజంగా క్షమాపణ చెప్పే ఉద్దేశం ఉంటే ఆనాడూ హైకోర్టులోనే సారీ చెప్పేదని అనిత వ్యాఖ్యానించారు. ఏనాడైనా రోజా మాదిరి తానూ మాట్లాడానని రుజువు చేస్తే… ఏ సవాల్ కైనా తానూ సిద్ధమని అనిత తన అంతరంగాన్ని బయటపెట్టారు. అయితే ఈ ఉదంతంలో రోజా కాస్త వెనక్కి తగ్గినట్లే కనపడుతోందని, బహుశా తను చేసిన తప్పును తెలుసుకుని ఉండవచ్చని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇదిలా ఉంటే, హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో రోజా దాఖలు చేసిన పిటిషన్ సోమవారానికి వాయిదా పడింది.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories