రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం, ఆర్ఆర్ఆర్. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియాభట్ హీరోయిన్ గా నటిస్తోంది.ఎన్టీఆర్ సరసన నటించడానికి హాలీవుడ్ నటి డైజీ ఎడ్గర్ జోన్స్ ను మొదట తీసుకున్నారు. అయితే ఆమె ఏవో పర్సనల్ కారణాలతో సినిమా నుండి తప్పుకుంది. ఆమె స్థానంలో ఇంకొకరిని తీసుకోవడానికి చాలానే కష్టపడ్డారు. మొత్తం ఒక బ్రిటిష్ భామనే తీసుకున్నట్టు మనకు ఉన్న సమాచారం.
అయితే ఆమె పేరు బయటకు రానివ్వడం లేదు రాజమౌళి. సరైన సమయంలో అనౌన్స్ చేద్దామని ఆయన ఉద్దేశమట. ఇది ఇలా ఉండగా ఆర్ఆర్ఆర్ షూటింగ్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. జులై 30, 2020 తారీఖున విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తుంది చిత్ర బృందం. బాహుబలి లగే తెలుగు, తమిళ, హిందీ, మలయాళం భాషలలో ఒకేరోజు విడుదల కాబోతుంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక స్క్రీన్లలో విడుదల కాబోతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.
ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు మరియు ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. మన రెండు తెలుగు రాష్ట్రాలకు తప్ప పెద్దగా తెలియని ఇద్దరి యోధుల కథను దేశం మొత్తం పరిచయం చెయ్యాలని రాజమౌళి కృతనిశ్చయంతో ఉన్నారట. ప్రభాస్ సాహూ, చిరంజీవి సైరా సినిమాలు బాలీవుడ్ లో సక్సెస్ అయితే ఆర్ఆర్ఆర్ మార్కెట్ మరింత పెరిగే అవకాశం ఉంది. దీనితో ఈ సినిమాపై నందమూరి, మెగా అభిమానులలో అంచనాలు భారీగా ఉన్నాయి.





