సమంతకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్!

rumour Samantha -akkineni wants share from U turn movieఆ మధ్య కన్నడలో విడుదలైన ‘యు టర్న్’ సినిమా అక్కడ మంచి లాభాలతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. వైవిధ్యభరితమైన సినిమాగా అక్కడి ప్రేక్షకులచే ప్రశంసలు అందుకుంది. దాంతో ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో రీమేక్ చేస్తున్నారు. కన్నడలో తెరకెక్కించిన పవన్ కుమార్ ఈ రీమేక్ కు దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. జర్నలిస్ట్ గా ఈ సినిమాలో సమంత ప్రధానమైన పాత్రను పోషిస్తోంది.

ADVERTISEMENT

ఈ సినిమా ఓ మాదిరి బడ్జెట్ తో రూపొందిస్తుండటం వలన, ముందుగా సమంత పారితోషికం తీసుకోవడం లేదట. సినిమా సక్సెస్ అయినా తరువాత లాభాల్లో వాటాను పొందేలా మాట్లాడుకుందని సమాచారం. ఈ తరహా అగ్రిమెంట్ పై సమంత సినిమా చేయడం ఇదే ఫస్టు టైమ్ అని అంటున్నారు. భూమిక, ఆది, రాహుల్ ఈ సినిమాలో కీలకమైన పాత్రలను పోషిస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories