ఒకటి హిస్టారికల్… మరొకటి ఫుల్ గ్లామర్..!

rumours-anushka-shetty-in-prabhas-saaho“బాహుబలి 2” సినిమాలో ‘దేవసేన’ పాత్ర ద్వారా అనుష్క పోషించిన క్యారెక్టర్ ఎంతటి ప్రజాధరణ పొందిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒక విధంగా చెప్పాలంటే మళ్ళీ అనుష్కకు పునర్జీవం ఇచ్చిన క్యారెక్టర్ గా పేర్కొనవచ్చు. అంతేకాదు, ఈ సినిమా ద్వారా ప్రభాస్ – అనుష్కల జంట సినీ ప్రేక్షకులకు హాట్ ఫేవరేట్ గా మారిపోయారు. అంతకుముందు ‘బిల్లా, మిర్చి’ సినిమాలలో కన్నులవిందు చేసిన ఈ జోడి, ‘బాహుబలి 2’తో ఏకంగా వీరిద్దరూ వివాహం చేసుకుంటున్నారు అనే దాకా పుకార్లు చెలరేగాయంటే… సిల్వర్ స్క్రీన్ పై ఎంత చూడముచ్చటగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

ADVERTISEMENT

అయితే మరోసారి అదే జంట వెండితెరపై వినోదాన్ని పంచేందుకు సిద్ధమవుతోందని సమాచారం. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కుతోన్న “సాహో” సినిమాలో హీరోయిన్ గా చివరికి అనుష్కనే ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. అధికారికంగా ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు గానీ, అనేక మంది బాలీవుడ్ ముద్దుగుమ్మలను పరిశీలించిన మీదట… ఫైనల్ గా మళ్ళీ ‘స్వీటీ’ వైపుకే మొగ్గుచూపినట్లుగా ట్రేడ్ టాక్. ‘బాహుబలి 2’తో ఇతర భాషల్లోనూ ఈ జంట పాపులర్ కావడంతో, అదే ఫీట్ ను రిపీట్ చేస్తే… ‘బాహుబలి’ పెయిర్ గా సినిమాకు కూడా కావల్సినంత పబ్లిసిటీ కూడా దక్కుతుంది.

‘దేవసేన’గా ఒక రాణిని చూసిన కళ్ళతో, మళ్ళీ అదే ప్రభాస్ పక్కన గ్లామరస్ హీరోయిన్ గా కనువిందు చేయబోతోంది అనుష్క. ‘అరుంధతి’ సినిమాలో పవర్ ఫుల్ రోల్ తర్వాత ‘బిల్లా’లో ఫుల్ గ్లామరస్ గా కనిపించిన అనుష్క, ‘నాగవల్లి’ తర్వాత ‘రగడ’లో అందాల విందు చేసింది. అలాగే ‘డమరుకం’ తర్వాత ‘మిర్చి’లోనూ, ‘రుద్రమదేవి’ తర్వాత ‘సింగం 3’లోనూ ఇలా ఒక చారిత్రాత్మకమైన పాత్ర తర్వాత ఫుల్ గ్లామరస్ రోల్స్ ను పండించడం అనుష్క కెరీర్ లో కాకతాళీయంగా జరిగిందో లేక ప్లానింగ్ ప్రకారం జరిగిందో గానీ… ‘బాహుబలి 2’ తర్వాత ‘సాహో’లో అందాల విందు చేయబోతుందన్న వార్త మాత్రం హాట్ హాట్ గా హల్చల్ చేస్తోంది.

ADVERTISEMENT
Latest Stories