పవన్ కల్యాణ్…. త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన ‘అజ్ఞాతవాసి’కి అభిమానుల నుంచే ఆదరణ కరువైన విషయం తెలిసిందే. ఓ ఫ్రెంచ్ సినిమాను కాపీ చేశారనే విషయం కూడా ఆ సినిమా ఫలితాన్ని ప్రభావితం చేసింది. తాజాగా అలాంటి రూమరే మహేశ్ బాబు ‘భరత్ అనే నేను’ సినిమా విషయంలో కూడా వినిపిస్తోంది.
ADVERTISEMENT
కొరటాల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా కోసం మరో రచయిత నుంచి కొరటాల కథ తీసుకున్నారు. అయితే ఆ రచయిత 90లలో వచ్చిన ఓ హాలీవుడ్ మూవీని ఆధారంగా చేసుకుని కథను అల్లుకున్నాడట. మరి ఆ సినిమా స్క్రీన్ ప్లేను అలాగే ఉంచారా… తనదైన శైలిలోకి కొరటాల మార్చారా? అనే విషయం తెలియాల్సి వుంది.
ADVERTISEMENT



