ఒక పక్క టాలీవుడ్ టాప్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ రాజమౌళి. మరో పక్క టాలీవుడ్ టాప్ హీరోలు చెర్రీ, ఎన్టీఆర్ ఈ ముగ్గురూ కలసి చెయ్యబోతున్న రచ్చ రాంబోలా “ఆర్.ఆర్.ఆర్” అని మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే దర్శకుడు రాజమౌళి ఏం చేసినా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. మరి అలాంటి దర్శకుడు ఈ సినిమాకు ఈ టైటిల్ ఎందుకు పెట్టాడో తెలియాలి అంటే మనం ఖచ్చితంగా సినిమా రిలీజ్ వరకూ వెయిట్ చెయ్యాల్సిందే. ఎందుకంటే ఆయన ప్రమోషన్ ప్లాన్ ఎప్పుడూ అలానే ఉంటుంది. అదేదో సినిమాలో చెప్పినట్లు “జ్యోతి లక్ష్మి డ్యాన్స్” చేస్తున్నట్లు చూపించి చూపించకుండా, కనిపించీ కనిపించకుండా మొత్తం తెరపైనే చూడమాంటాడు.
[m9ad]
ఇదిలా ఉంటే నిన్న కాక మొన్న సినిమా షూటింగ్ కి ఫర్స్ట్ క్లాప్ కొట్టారో లేదో కానీ, అప్పుడే మీడియా మొత్తం హడావిడి మొదలు పెట్టేశాయి. ఈ సినిమా బడ్జెట్ గురించి ఊహాగానాలు, ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర ఇలా ఉండబోతుంది అంటూ గాసిప్స్, సినిమా చెర్రీ ఏం చెయ్యబోతున్నాడో అంటూ రూమర్స్, ఇక టైటిల్ విషయంలో కూడా “ఆర్.ఆర్.ఆర్” అంటే “రామ-లక్ష్మణ-రావణ” అంటూ దర్శకుడు రాజమౌళికి కూడా అందని లాజిక్స్ తో కధలు కధలు రాసేస్తూ ఉన్నాయి మీడియా వర్గాలు.
ఇదిలా ఉంటే తాజాగా మరో అప్‌డేట్ వచ్చేసింది అదేంటి అంటే, సినిమా ఫర్స్ట్ లుక్ పోస్టర్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని. జక్కన్న మదిలో మాటలను పట్టేసి మనకు చెప్పేసె ప్రయత్నం జరుగుతుంది. ఇంతకీ ఈ సినిమా ఫర్స్ట్ లుక్ ఎప్పుడో తెలుసా, ఈ నెల చివర్లోనే అట. ఈ నెల ఎండింగ్ లోనే సినిమా ఫర్స్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసేసి, అందులో ఎన్టీఆర్, చెర్రీ ఎలా ఉండబోతున్నారో చెప్పేసి, ఇక హీరోయిన్స్ ను కూడా సెలెక్ట్ చేసేసి, సినిమా మాత్రం రెండు మూడు ఏళ్లు షూటింగ్ చేస్తాడు రాజమౌళి. అయితే ఇక్కడ అర్ధం కానీ విషయం ఏంటి అంటే పాపం ఈ ఫర్స్ట్ లుక్ రిలీజ్ విషయం రాజమౌళికి తెలుసో లేదో?. ఇంకెందుకు ఆలస్యం ఫర్స్ట్ లుక్ మ్యాటర్ ఎలాగో పసిగట్టేసాం కాబట్టి, మెల్లగా జక్కన్న బుర్రలో దూరేసి సినిమా రిలీజ్ డేట్ కూడా తెలుసుకుంటే ఒక పని అయిపోతుంది కదా. ఒకసారి ట్రై చేస్తే పోలా!



