ఆ దేవరకొండ సినిమా ఆపెయ్యలేదట..

rumours on Vijay Deverakonda - Director Kranthi Madhav Movie యంగ్ హీరో విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ తో ఒక పెద్ద ప్లాప్ మూటగట్టుకున్నాడు. విజయ్ చేతిలో రెండు ప్రాజెక్టులు ఉన్నాయి ప్రస్తుతం… క్రాంతి మాధవ్ సినిమా మరియు హీరో అనే ద్విభాషా చిత్రం. క్రాంతి మాధవ్ సినిమా దాదాపుగా పూర్తి అయిపోయింది. హీరో సినిమా రద్దు అయిపోయిందని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా షూటింగ్ చాలా వరకూ పూర్తి అయ్యిందని, అయినా బడ్జెట్ అదుపుతప్పడం, అవుట్ ఫుట్ బాలేకపోవడంతో పక్కన పెట్టినట్టు వార్తలు వచ్చాయి.

ADVERTISEMENT

అయితే ఇప్పుడు ఈ సినిమా తిరిగి పట్టాలు ఎక్కిస్తున్నారట. చిన్నపాటి కరెక్షన్లతో పాటు మిగిలి ఉన్న షూటింగ్ ను వచ్చే నెల నుండి మొదలు కాబోయే 35 రోజుల షెడ్యూల్ లో పూర్తి చేస్తారట. నవంబర్ లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారట. తమిళ దర్శకుడు ఆనంద్ అన్నామలై ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో ద్విభాషా చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది.

ఒకప్పుడు సక్సెస్ కు చిరునామాగా ఉండే మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. గత కొంత కాలంగా ఆ నిర్మాణ సంస్థను పరాజయాలు పలకరిస్తున్నాయి. దీనితో ఆ సంస్థ కూడా ఈ సినిమా మీద చాలానే ఆశలు పెట్టుకుంది. ఇటీవలే వారు విజయ్ దేవరకొండ తో తీసిన డియర్ కామ్రేడ్ కూడా పరాజయం బాట పట్టడంతో వారు ఈ సినిమా గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఒక బైక్ రేసర్ గా కనిపించబోతున్నాడని సమాచారం.

ADVERTISEMENT
Latest Stories