తమ్ముడు తమ్ముడే… పేకాట పేకాటే… రోజా సిద్ధాంతం..!

roja Jabardasthఒక ప్రజాప్రతినిధిగా ఉంటూ ‘అడల్ట్’ కంటెంట్ జోకులు ఉండే ‘జబర్దస్త్’ షోలో ఎలా పార్టిసిపేట్ చేస్తారంటూ నగరి ఎమ్మెల్యే రోజాపై వెల్లువెత్తిన విమర్శలకు కొదవలేదు. అయితే ‘తమ్ముడు తమ్ముడే… పేకాట పేకాటే…’ అన్న సిద్ధాంతంలో రోజా తన రాజకీయ జీవితాన్ని, ఎంటర్టైన్మెంట్ రంగాన్ని మిళితం చేసుకుంటూ సాగుతోంది. ఎన్ని విమర్శలు వచ్చినా పట్టించుకోని రోజా, ఇటీవల మాత్రం ఈ విమర్శలను కాస్త సీరియస్ గా పరిగణించి, ‘జబర్దస్త్’ షో నుండి తప్పుకోవాలని భావించినట్లుగా వార్తలు హల్చల్ చేసాయి.

అంతేకాదు, రోజా స్థానంలో ‘బాహుబలి’ రమ్యకృష్ణ ఎంపికైందన్న వార్తలు కూడా వినిపించాయి. అయితే తాజా సమాచారం మేరకు అసలు రోజా ‘జబర్దస్త్’ను వీడే ఆలోచనలు చేయలేదని, అలాగే ‘జబర్దస్త్’ నిర్వాహకులు కూడా రోజాను తప్పించి మరో నటిని తీసుకునే ఉద్దేశంలో లేరని తేలింది. దీంతో ‘జబర్దస్త్’ షోలో రోజా నవ్వులు మిస్సవుతాయోమోనని భావించిన వీక్షకులకు ‘స్వీట్’ న్యూస్ అందినట్లయ్యింది. కొన్ని షోలలో కొంతమంది ప్రేక్షకులకు అలా కనెక్ట్ అయిపోతుంటారు. అలాగే ‘జబర్దస్త్’ షోలో కూడా రోజా నవ్వులు అలా సెట్ అయిపోయాయి మరి..!

ADVERTISEMENT

ADVERTISEMENT
Latest Stories