లీజ్ డేట్ ప్రకటించిన క్రేజీ మూవీ!

RX-100-Movie-Releaseగత ఏడాది ‘అర్జున్ రెడ్డి’ ఎంత సంచలనంగా నిలిచిందో, ఈ ఏడాది “ఆర్ఎక్స్ 100” అంత హాట్ టాపిక్ గా మారింది. బోల్డ్ మూవీగా ఇప్పటికే ఇండస్ట్రీలో టాక్ తెచ్చుకున్న ఈ సినిమా టీజర్, ట్రైలర్ ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రెండు పాటలు కూడా రిలీజ్ అయిన ఈ సినిమా రిలీజ్ డేట్ ను తాజాగా చిత్ర యూనిట్ ప్రకటించింది.

ఈ నెల 12వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా “RX100″ను రిలీజ్ చేస్తున్నామని ఓ పోస్టర్ ను రిలీజ్ చేస్తూ ఖరారు చేసారు. అజయ్ భూపతి దర్శకత్వం వహించిన ఈ సినిమా గ్రామీణ వాతావరణంలో తెరకెక్కింది. ఈ సినిమాలో హీరో హీరోయిన్లుగా నటించిన కొత్త నటీనటులు కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ ల కెమిస్ట్రీ హైలైట్ గా నిలుస్తుందని చిత్ర యూనిట్ చెప్తోంది.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories