ఈ గర్వం వేరు.. రాజమౌళి కి పట్టం!

S.-S.-Rajamouli-Baahubali-2-Japanరాజమౌళి కళాఖండం ‘ బాహుబలి – 2 ‘, ఎంత పెద్ద హిట్ అయ్యిందో, తెలుగు ప్రేక్షకులకు చెప్పనక్కర్లేదు. ప్రభాస్ కి, రాణా కి, రాజమౌళికి, అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చిన సినిమా బాహుబలి. దక్షిణాదిన తెలుగు, తమిళం, మలయాళం మరియు హిందీ భాషల్లో విడుదలైన.. బాహుబలి రెండు భాగాలూ .. అద్భుత విజయాన్ని సాధించాయి. విదేశాల్లో కూడా ఈ సినిమా విడుదలై ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. చైనా లో మాత్రం బాహుబలి-1 అంతగా ఘానా విజయం సాధించలేదు.

ఇప్పుడు జపాన్ లో బాహుబలి-2 రిలీజ్ సందర్భంగా.. రాజమౌళి బృందం జపాన్ థియేటర్స్ కి వెళ్లి.. అక్కడ తెలుగు లో ‘మంచి చిత్రం అందించినందుకు థాంక్స్ ‘,’ రాజమౌళి – శోభు యార్లగడ్డకు స్వాగతం’ అని .. తెలుగులో రాసిన బోర్డు లు చూసి ఆశ్చర్యపోయారు. ఆనందం తో ఉబ్బి తబ్బిబ్బయ్యారు. జపాన్ మార్కెట్ ను జయించడం అంత సులువు కాదు.. జపనీయులు బాహుబలి లాంటి జానపద చిత్రాలు, చాలా చూసి ఉన్నారు. వారిని తృప్తి పరచగలడో ? లేడో ? రాజమౌళి! అల్ ది బెస్ట్ బాహుబలి!.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories