యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ సాహూ సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ రాబడుతుంది. వారాంతం ముగిసేనాటికి మొదటి మూడురోజులకు గాను 79 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టిన సాహూ పండగ రోజైన సోమవారం 14.85 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించినట్లు సమాచారం. దీనితో కలిపి మొత్తంగా ఇండియా వైడ్ గా సాహూ హిందీ వర్షన్ దాదాపు 94 కోట్ల వసూళ్లు సాధించినట్లు తెలుస్తుంది. వినాయక చవితి నార్త్ లో ఎక్కువగా జరుపుకోరు…. అందుకే అడ్వాంటేజ్ కొంత మేరే ఉంది.
ఇక రెండు మూడు రోజులలో సాహో వంద కోట్ల మార్కు చేరుకొంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. బాలీవుడ్ ఫిల్మ్ క్రిటిక్స్ సాహూకి మొదటి షో నుండే దారుణమైన రివ్యూలు ఇచ్చిన నేపథ్యంలో ఇలాంటి ఆదరణ దక్కడం ప్రభాస్ స్టార్ డమ్ ని తెలియజేస్తుంది. ఒక సౌత్ ఇండియన్ హీరో సినిమాకి నెగెటివ్ టాక్ తర్వాత కూడా ఇంత మంచి కలెక్షన్స్ రావడం బాలీవుడ్ ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేస్తుంది. మొదటి రోజు తిట్టిన నోళ్లే ఇప్పుడు ప్రభాస్ ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
ఇక సాహూకు రెండు తెలుగు రాష్ట్రాలలో నిన్నటితో హాలిడే అడ్వాంటేజ్ పూర్తి అయిపోయింది. ఈరోజు నుండి వర్కింగ్ డేస్ కావడంతో సినిమాకు నిజమైన పరీక్ష ఎదురుకాబోతుంది. ఇప్పటికీ సినిమాను చాలా చోట్ల పెంచిన రేట్లతో నడపడంతో సినిమాకు ఇబ్బందనే చెప్పుకోవాలి. బ్రేక్ ఈవెన్ అనిపించుకోవాలంటే సాహూ ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషలలో కలిపి 290 కోట్ల షేర్ రాబట్టాలి. అయితే సినిమా టాక్ కంటే బెటర్ గా పెర్ఫర్మ్ చేస్తున్నా అది కష్టమనే చెప్పుకోవాలి.





