టీజర్ టాక్ : సచిన్ ప్రేమికులందరికీ పండగ!

Sachin A Billion Dreams Teaser‘ఇండియన్ క్రికెట్ గాడ్’ సచిన్ టెండూల్కర్ అభిమానులందరికీ పండగ లాంటి సినిమా రాబోతోంది. “సచిన్ – ఎ బిలియన్ డ్రీమ్స్” పేరుతో రూపుదిద్దుకోనున్న సినిమా తొలి టీజర్ క్రికెట్ ప్రేమికులను, సచిన్ అభిమానులను ఉత్తేజ పరిచే విధంగా రూపుదిద్దుకుంది.

‘సచిన్ సచిన్’ అంటూ బ్యాక్ గ్రౌండ్ లో వస్తున్న నినాదం… సచిన్ వాయిస్… ఏఆర్ రెహ్మాన్ సంగీతం… వికెట్ పైన కాయిన్ పెట్టి తనను అవుట్ చేయకపోతే ఆ కాయిన్ ను సొంతం చేసుకునే సచిన్ చిన్ననాటి అనుభూతి నుండి ఒక ఐకాన్ గా ఎదిగిన తీరు వరకు… టీజర్లో ప్రతి షాట్ సచిన్ అభిమానులకు పండగ చేసుకునేలా ఉంది. దీంతో ఈ సినిమా అంచనాలు రెట్టింపు అయ్యాయని చెప్పడంలో సందేహం లేదు.

ADVERTISEMENT

ADVERTISEMENT
Latest Stories