క్రికెట్ నుండి రిటైర్మెంట్ ను తీసుకున్న తర్వాత మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ జీవితాన్ని ఎంజాయ్ చేయడం ప్రారంభించారు. ప్రపంచంలోని విశిష్ట ప్రదేశాలను చూస్తూ ఎప్పటికప్పుడు తన అభిమానులకు ట్విట్టర్ వేదికగా సమాచారం అందిస్తున్న సచిన్, ఈ సారి ఏకంగా మరో ఇండియానే కనిపెట్టారు. అవును… నాడు వాస్కోడగామా హిందూ దేశాన్ని కనిపెట్టినట్లు మరో ఇండియా ఆవిర్భావాన్ని సచిన్ వెలుగులోకి తెచ్చారు.
ఐస్ ల్యాండ్ లో డ్రైవ్ చేస్తున్న సమయంలో ఓ నీటి సముదాయం ఇండియా మ్యాప్ ను పోలి ఉందని… దానికి సంబంధించిన ఓ సెల్ఫీ ఫోటోను సచిన్ తన ట్విట్టర్లో పోస్ట్ చేసారు. సారే జహాన్ సే అచ్చా హిందూస్తాన్ హమారా… అంటూ దేశభక్తిని చాటుకున్న సచిన్ పోస్ట్ చేసిన ఫోటో నిజంగానే ఇండియా మ్యాప్ మాదిరి ఉండడం వీక్షకులను విశేషంగా ఆకర్షిస్తోంది.
ADVERTISEMENT
ADVERTISEMENT



