పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కున్న క్రేజ్ తెలియనిది కాదు. ఏదైనా సినిమాలో పవన్ పోస్టర్ ఉంటేనే… ఆ సినిమాను హిట్ రేంజ్ కు తీసుకెళ్ళే సత్తా పవన్ ఫ్యాన్స్ ది. తమ అభిమాన హీరోకు సంబంధించిన ప్రతి చిన్న అంశం ఫ్యాన్స్ కు ఆసక్తికరమైన విషయమే కదా! అలాంటి ఓ వార్తనే పవన్ మేనల్లుడు సాయిధరమ్ తేజ్ లేటెస్ట్ గా చెప్పుకొచ్చారు.
తను నటించిన సినిమాలలో చినమావయ్య పవన్ కళ్యాణ్ చూసింది ఒకే ఒక సినిమా అని, అది లేటెస్ట్ ‘సుప్రీమ్’ అని తెలిపారు సాయి. అయితే పెదమావయ్య చిరంజీవి మాత్రం ‘రేయ్’ సినిమా తప్ప అన్ని చూసారని తన అనుభూతులను పంచుకున్నారు. తనలో ముగ్గురు మావయ్యల పోలికలు ఉంటాయని, ఈ విషయాన్ని పలు సందర్భాల్లో తన స్నేహితులు చెబుతుంటారని, అలా అన్నపుడు భలే గర్వంగా ఉంటుందని… వాళ్ల చేతుల్లో పెరిగిన తాను, వారిని ప్రతిబింబిస్తున్నానంటే ఎవరికైనా గర్వంగానే ఉంటుందని అన్నాడు ఈ ‘సుప్రీమ్’ హీరో.
అయినా వారిలా కనిపించడం నేరం కాదు కదా? తన కుటుంబంలో వారికే వివిధ సందర్భాల్లో వారిలా కనిపిస్తానని, అవి జీన్స్ అని, చిన్నప్పటి నుంచి వారిని చూస్తూ పెరిగిన తనలో మావయ్యల ప్రభావం స్పష్టంగా ఉంటుందని అన్న సాయి, తన తల్లిని విదేశాలకు తీసుకెళ్లాలని, ఆమెతో హాలీడేకు వెళ్లాలన్న ఆకాంక్షను వెలిబుచ్చాడు. తన మునుపటి జీవితంలో తను చాలా మందికి ప్రపోజ్ చేశాను, కాకపోతే అప్పుడు బాగా లావుగా ఉండడం వల్ల తన ప్రపోజల్ ను ఎవరూ అంగీకరించలేదని కూడా ఎలాంటి మొహమాటం లేకుండా చెప్పాడు మెగాస్టార్ మేనల్లుడు.



