యూ ట్యూబ్ లో అదరగొడుతోంది!

sai dharam tej Jawaan Hindi Dubbed Movie in youtubeవరుస వైఫల్యాలను చవిచూడడంలో మెగా హీరో సాయిధరమ్ తేజ్, తాజా “తేజ్ ఐ లవ్ యూ” సినిమాతో రెండు హ్యాట్రిక్ లను పూర్తి చేసుకున్నాడు. సిల్వర్ స్క్రీన్ పై తేలిపోయినా, యూ ట్యూబ్ లో మాత్రం సాయి సినిమా దుమ్ము దులుపుతోంది. రచయిత బివిఎస్ రవి దర్శకత్వం వహించిన “జవాన్” సినిమా ఇటీవల హిందీలోకి డబ్ చేసి యూ ట్యూబ్ లో రిలీజ్ చేసారు.

[m9ad]

ADVERTISEMENT

కేవలం నాలుగు రోజుల్లోనే 16 మిలియన్స్ కు పైగా క్లిక్స్ తో ఈ సినిమా దూసుకుపోతుండడంతో, సాయి నటించిన గత సినిమాలు కూడా హిందీలోకి డబ్ కావడం ఖాయమని చెప్పవచ్చు. ఇటీవలే మెగా హీరో అల్లు అర్జున్ ‘సరైనోడు’ సినిమా ద్వారా యూ ట్యూబ్ లో ఆల్ టైం రికార్డు కొట్టగా, అదే ట్రాక్ లో సాయి “జవాన్”కు అద్భుతమైన ఓపెనింగ్స్ రావడం ఊహించినది కాదు.

ADVERTISEMENT
Latest Stories