టాలీవుడ్ కు కావాల్సింది ఇలాంటి కొత్త రక్తమే

Sai Dharam Tej Virupaksha Teaserకాలం టెక్నాలజీతో పాటు ప్రేక్షకుల అభిరుచులు అలవాట్లలో బోలెడు మార్పు వస్తోంది. గూగుల్ మ్యాప్స్, జొమాటోలు కేవలం చదువుకున్న నగర జనాలే కాదు అంతో ఇంతో నాలుగక్షరాలు నేర్చుకున్న పల్లెటూరివాళ్ళు కూడా వాడుకుంటున్నారు. అయిదు రూపాయల టీ డబ్బుల కోసం క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడానికి ఎంబిఎ చదవనక్కర్లేదు. ఓ పది నిముషాలు దాని వాడకం తెలుసున్న వాళ్ళ దగ్గర సమయం గడిపితే చాలు. దీనికి సినిమాలకు సంబంధం ఏంటనే ప్రశ్న దగ్గరికి వద్దాం. థియేటర్ ఎక్స్ పీరియన్స్ కి అర్థం సరికొత్త పుంతలు తొక్కుతోంది.

ఆషామాషీ కథలతో రొటీన్ కమర్షియల్ కథలతో వస్తామంటే ప్రేక్షకులు నిర్మొహమాటంగా తిప్పి కొడుతున్నారు. ఏదో సంక్రాంతి సీజన్ వల్ల బడా హీరోలు రొటీన్ ఫార్ములాతో గట్టెక్కవచ్చేమో కానీ ఏడాది పొడవునా అలా సాధ్యం కాదు. నవ్యతకు పెద్ద పీఠ వేయడం కనిపిస్తోంది. సాయిధరమ్ తేజ్ విరూపాక్ష అంటూ మూఢ నమ్మకాలను తీసుకుని ఏదో కొత్త ప్రయత్నం చేశాడు. నిన్న సంవత్సరం శర్వానంద్ ఒకే ఒక జీవితం, నిఖిల్ కార్తికేయ 2, కళ్యాణ్ రామ్ బింబిసారలతో విభిన్న ప్రయోగాలు చేసి బ్లాక్ బస్టర్లు అందుకున్నారు. వీటిలో ఐటెం సాంగులు, ఫిజిక్స్ ని ఛాలెంజ్ చేసే ఫైట్లు గట్రా ఏమీ ఉండవు. మూసగా అనిపించే అంశాలు మచ్చుకు కూడా ఉండవు.

ADVERTISEMENT

కొత్తదనం నిండిన దర్శకుల ఆలోచనలకు ప్రోత్సాహం తోడై ఆడియన్స్ సూపర్ హిట్లు కలెక్షన్లు చేతిలో పెట్టారు. ఇవన్నీ క్లాసు మాస్ అందరినీ మెప్పించినవే. ఎమోషన్లు కాస్త ఎక్కువైనా సరే సార్ ని సైతం ఆదరించారు. కారణం కంటెంట్ లో చూపించిన నిజాయితీ. అర్జున్ రెడ్డి లాంటి రా అండ్ రస్టిక్ లవ్ స్టోరీని స్వాగతించినా, కాంతార లాంటి నేటివిటీ ప్రధానమైన ప్రయత్నాన్ని మనసారా ఆశీర్వదించినా ఇది థియేటర్ కోస్తున్న జనాల మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తోంది. తమకు ఫలానా స్టోరీలు కావాలని పబ్లిక్ ఎప్పుడూ డిమాండ్ చేయరు. ఆ అవకాశం కూడా ఉండదు. వచ్చినవాటిలో క్రియేటివ్ గా ఉన్న వాటికి సింహాసనం కట్టబెడతారు అంతే.

వాళ్ళను అర్థం చేసుకుని దానికి తగ్గట్టు కొత్త నీరు అందించాల్సిన బాధ్యత న్యూ జనరేషన్ డైరెక్టర్లది. కెఎస్ రవికుమార్, గౌతమ్ మీనన్, భాగ్యరాజా లాంటి లెజెండరీ దర్శకులు పూర్తిగా నటనవైపే ఎందుకొచ్చారంటే ఇప్పటి టేస్ట్ కు తగ్గట్టు అప్డేట్ చేసుకునే సామర్ధ్యం తగ్గడం లేదా ఇష్టం లేకపోవడం వల్లే. ఈ కారణంగానే కోదండరామిరెడ్డి, బి గోపాల్ లాంటి వాళ్ళు ఇంకా తీయగల శక్తి ఉన్నా త్వరగా రిటైర్ మెంట్ తీసుకున్నారు. ఇండస్ట్రీకి వచ్చి ఇరవై ఏళ్ళు దాటుతున్నా త్రివిక్రమ్, రాజమౌళిని గెలుస్తున్నారంటే ఎప్పటికప్పుడు తమ ఎనర్జీని రెన్యూవల్ చేసుకోవడమే. లోకేష్ కనగరాజ్, ప్రశాంత్ నీల్ లను యూత్ ఎందుకు అంతగా ఇష్టపడుతున్నారో అర్థం చేసుకుంటే చాలు బ్లాక్ బస్టర్లు ఎవరైనా తీయొచ్చు.

ADVERTISEMENT
Latest Stories