నిర్మాత కమ్ డిస్ట్రిబ్యూటర్…సాయి కొర్రపాటి! నిర్మాత ఒకటి రెండు సినిమాలు మినహా పెద్దగా హిట్స్ లేవు ఈయనకు. అయితే.. డిస్ట్రిబ్యూటర్ గా మాత్రం ఈయనకు మంచి హిట్స్ అందుకున్నారు సాయి..
[m9ad]
ఇదిలా ఉంటే ఒక పక్క ఎన్ఠీఆర్ బయోపిక్ లో బిజీగా ఉంటూనే..మరో పక్క తెలుగులో ‘కే.జీ.ఎఫ్’ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేశారు సాయి. కట్ చేస్తే భారీ కాంపిటేషన్ బరిలో నిలిచిన ఈ సినిమా భారీ హిట్ ను అందుకుంది..ఇక మిగిలిన సినిమాలు షెడ్ కి వెళ్లిపోగా ఈ సినిమాని జస్ట్ నాలుగున్నర కోట్ల అడ్వాన్స్ ఇచ్చి కొన్ని..స్వయంగా విడుదల చేసిన సాయికి ఈ సినిమా మంచి వసూళ్లే తెచ్చిపెడుతుంది.
మరో పక్క సంక్రాతి వరకు పోటీ లేకపోవడం..ఇక వచ్చే వారం ఎక్కువ థియేటర్స్ ఖాళీ కావడంతో ఈ సినిమాకి థియేటర్స్ లెక్క పెరగడం అన్నీ కలగలిపి సినిమా ఫుల్ రన్ లో మంచి వసూళ్లనే నమోదు చేసి…సాయికి లాభాలే తెచ్చిపెడుతుంది అని చెప్పక తప్పదు.
మరి ఫుల్ రన్ లో యష్ ఎంత రాబట్టి సాయి ఖాతాలో వేస్తాడో చూద్దాం.



