ఆదిపురుష్ లో అతనైతే బెటర్ గా ఉండేదట

Can Adipurush Team Ensure The Steam Running for Two Years?రామాయణం ఆధారంగా ప్రభాస్ హీరోగా వస్తున్న తాజా బాలీవుడ్ చిత్రం… ఆదిపురుష్. ఈ సినిమా 2021లో సెట్స్ మీదకు వెళ్తుందని నిర్మాతలు చెబుతున్నా, 2022 వరకు సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు తక్కువే అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ లోగా ప్రభాస్ ఒకటిన్నర సినిమా షూటింగ్ పూర్తి చెయ్యాలి.

ADVERTISEMENT

సినిమా మొదలు కావడానికి చాలా టైం ఉన్నా చిత్ర నిర్మాతలు సినిమాను గట్టిగా ప్రమోట్ చేస్తున్నారు. తాజాగా రాముడితో తలపడే రావణాసురుడి పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ నటించబోతున్నారని ప్రకటించారు. ఓం రౌత్ రూపొందించిన `తానాజీ` చిత్రంలో కూడా సైఫ్ విలన్ పాత్రలో నటించి మెప్పించాడు.

తాజాగా `ఆదిపురుష్`లోనూ విలన్ పాత్రను దక్కించుకున్నాడు. అయితే ప్రభాస్ కట్ అవుట్ ముందు ప్రతినాయకుడి పాత్రలో ఆయన సరిపోతారా అనే చర్చ జరుగుతుంది. మరో వైపు కొందరు మాత్రం బాహుబలిలో ప్రభాస్ కు ప్రతినాయకుడిగా నటించిన రానా దగ్గుబాటి అయితే ఈ పాత్రకు సరిగ్గా సరిపోతాడని చాలా మంది అభిప్రాయం.

రానాకు బాలీవుడ్ లో కూడా క్రేజ్ ఉంది. అదే సమయంలో బాహుబలి ఎఫెక్ట్ ఎలానో ఉంటుంది. అదే సమయంలో సైఫ్ కూడా పెద్ద క్రేజీ స్టార్ ఏమీ కాదు. కాబట్టి అన్ని రకాలుగా సైఫ్ కంటే రానా బెటర్ ఛాయస్ అంటున్నారు. మరోవైపు… ఈ చిత్రం యొక్క తరువాతి అప్డేట్ గా హీరోయిన్ ని ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు.

ADVERTISEMENT
Latest Stories