
ఐదేళ్ల అధికార అహంకారం వైసీపీ నేతలకు కానీ సాక్షి మీడియాకు కానీ ఇంకా పూర్తిగా దిగలేదు అనేలా రాష్ట్రంలో ఎన్నో ఘటనలు రుజువుచేస్తూనే ఉన్నాయి. తాజాగా సాక్షి డిబేట్ లో జరిగిన ఓ ఘటన ఇందుకు నిదర్శనంగా నిలిచింది.
రాష్ట్ర రాజధాని అమరావతి పై వైసీపీ విష ప్రచారానికి తోడు సాక్షి నీలి రాతలు, పిచ్చి చేష్టలు ఇప్పటికి కొనసాగుతూనే ఉన్నాయి. రాజధాని అమరావతి “ఒక వేశ్యల నగరం” అంటూ సాక్షిలో జరిగిన ఒక చర్చ రాష్ట్రంలో హాట్ టాపిక్ అయ్యింది.
Also Read – అంతర్జాతీయ యోగా దినోత్సవానికి విశాఖ సర్వం సిద్దం
మీడియా ముసుగులో సాక్షి, జర్నలిస్టుల ముసుగులో కృష్ణంరాజు, కొమ్మినేని వంటి వారు ఒక రాష్ట్ర గుర్తింపు, గౌవరాన్ని, ఐదు కోట్ల ప్రజలు ఆత్మాభిమాన్ని ఇలా రోజుకోరకంగా అవమానిస్తున్నారు. అమరావతి పై ఎప్పుడు ఇటు ప్రజలతో పాటు అటు పెట్టుబడిదారులకు సైతం అభద్రతా భావాన్ని సృష్టించేలా రాజధాని పై ఎదో ఒక వివాదాన్ని రేపుతూనే ఉన్నారు.
ఒక రాష్ట్ర రాజధాని పై సాక్షి మీడియా, అందులోని వ్యక్తులు ఇంతలా దిగజారి మాట్లాడుతున్నారు అంటే అది వైసీపీ నేర్పిన బరితెగింపా.? లేక కూటమి ప్రభుత్వం పాటిస్తున్న అతి మంచితనమా.? అమరావతిని వేశ్యల నగరంగా చిత్రీకరించే స్థాయికి వైసీపీ జర్నలిజం దిగజారింది అంటే అది పూర్తిగా సాక్షి యాజమాన్యం దుస్ససహమనే చెప్పాలి, వైసీపీ దుర్మార్గమనే నమ్మాలి.
Also Read – జగన్ రెచ్చిపోతున్నారు..పవన్ పత్తాలేరు.?
అయితే రాజధాని పై ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం అంటే మహిళను కించపరచడమే అంటూ ప్రకటించిన ప్రభుత్వం అందుకు తగ్గట్టే అటువంటి ఉన్మాదుల మీద తక్షణ చర్యలకు ఉపక్రమించింది. కృష్ణంరాజు, కొమ్మినేని ఉన్మాదానికి గాను ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలలో నిరసన వ్యక్తమవ్వడంతో పాటు ఆ ఇద్దరి పై సాక్షి మీడియా పై చర్యలు తీసుకోవాలంటూ కేసులు నమోదయాయ్యి.
అందుకు అనుగుణంగానే నేడు హైదరాబాద్ లో కొమ్మినేని ని ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకుని రాజధాని ప్రాంతమైన తుళ్లూరు పీఎస్ కు తరలిస్తున్నారు. అయితే ఇన్నాళ్లు వైసీపీ నేతల అవినీతికి, అక్రమాలకు అందగాడు, సౌమ్యుడు అంటూ పేర్లు పెట్టి మద్దతు పలికిన మాజీ ముఖ్యమంత్రి మరి ఈ కొమ్మినేని ని ఏ పేరుతో సరిపోల్చుకుంటారో.? ఏ రకంగా వీరి దుర్మార్గానికి మద్దతు పలుకుతారో చూడాలి.