నా లైఫ్ నాకు బోర్ కొట్టేస్తుందంటున్న ‘మెగాస్టార్’

Salman Khan, Salman Khan Boring Bio Pic, Salman Khan Boring Bio Pic Movie, Salman Khan Boring Life Story, Salman Khan Boring Bio Pic Film‘వాంటెడ్’ సినిమా నుండి ‘సుల్తాన్’ సినిమా వరకు వరుసగా విజయాలను నమోదు చేసుకుంటూ ఆలిండియా మెగాస్టార్ గా మారిన సల్మాన్ ఖాన్… తన జీవితం తనకు బోర్ కొట్టేస్తుందని అభిప్రాయ పడ్డారు. “సుల్తాన్” చిత్రం విజయాన్ని పురస్కరించుకుని జరిగిన మీడియా సమావేశంలో ఆసక్తికరమైన జవాబులు చెప్పాడు సల్మాన్.

“బాలీవుడ్ లో బయోపిక్ ల చరిత్ర నడుస్తోంది కదా? మీ చరిత్రను ఎవరు తీస్తే బాగుటుంది?” అంటూ అడిగిన ప్రశ్నకు… ‘నాది చాలా బోరింగ్ లైఫ్. బోరింగ్ లైఫ్ మీద ఎవరూ సినిమా తీయాలనుకోరు. ఒకవేళ ఎవరైనా నా జీవిత చరిత్రను సినిమాగా తీస్తానని నన్ను సంప్రదిస్తే దానికి నేను అంగీకరించను. ఎందుకంటే నా జీవితం గురించి నా కుటుంబానికి తప్ప మరొకరికి తెలియదు, అందువలన తమకు సంప్రదించకుండా నా జీవితం గురించి సినిమా తీయడం అసాధ్యం’ అన్నాడు ఈ మెగాస్టార్.

ADVERTISEMENT

‘నా జీవితం గురించి నా కుటుంబ సభ్యులు, తమ్ముళ్లు, చెల్లెళ్లు కథగా రాస్తే అది వాస్తవం అవుతుంది కానీ, ఎవరో ఒకరు రాస్తే అందులో వాస్తవాలు ఉండే అవకాశం లేదు. అదంతా పక్కన పెడితే నా బయోపిక్ లో నటించేందుకు సరైన నటుడు ఎవరున్నారో చెప్పండి? నాకు తెలిసి సల్మాన్ ను ప్రతిబింబించే నటుడు లేడు’ అని కండల వీరుడు తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు. అయితే సల్మాన్ జీవితంలో ముఖ్యమైన ‘ఐశ్వర్యరాయ్, కత్రీనా కైఫ్’ రెండు ఎపిసోడ్ లు ఉన్నాయి. ఆ ఉదంతాలలో జరిగిన అసలు వాస్తవాలు ఏమిటో అన్న ఆసక్తి ప్రతి సినీ అభిమానుల్లో నెలకొని ఉంది.

ADVERTISEMENT
Latest Stories