13 సంవత్సరాల పాటు విచారణ జరిగిన బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ “హిట్ అండ్ రన్” కేసులో సల్మాన్ ను నిర్దోషిగా తెలుస్తూ బాంబే హైకోర్ట్ ఇటీవల తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే సల్మాన్ కాకపోతే ఈ కేసులో దోషి ఎవరు? ఏకంగా కారే మద్యం తాగి ఆ రోజు యాక్సిడెంట్ చేసిందా… అంటూ సోషల్ మీడియాలో ఛలోక్తులు వినిపించాయి. దీనికి తోడు ఆ యాక్సిడెంట్ బాధితులు కూడా ఈ తీర్పు పట్ల పెదవి విరిచారు. తమను వికలాంగులుగా మలిచిన ఆ యాక్సిడెంట్ వలన తమ జీవితం కోల్పోయామని వాపోతున్నారు.
ఇదంతా బాంబే హైకోర్ట్ తీర్పు వచ్చిన రెండు, మూడు రోజుల నాటి సంగతులు. కానీ, తాజాగా ఈ కేసును మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసేందుకు సిద్ధమవుతున్నట్లుగా సమాచారం. సల్మాన్ నిర్దోషిత్వాన్నిసవాల్ చేస్తూ… అత్యున్నత న్యాయస్థానంలో మహారాష్ట్ర సర్కార్ ఓ పిటిషన్ దాఖలు చేయాలని భావిస్తోందట. ఇదే జరిగితే సల్మాన్ కు, ఆయన అభిమానులకు ఊహించని ‘ట్విస్ట్’ ఎదురు కావచ్చని తెలుస్తోంది.





