‘వాంటెడ్’ సినిమా నుండి వరుసగా కమర్షియల్ సక్సెస్ లను చవిచూస్తున్న స్టార్ హీరో సల్మాన్ ఖాన్ “ట్యూబ్ లైట్” చిత్రం ప్రేక్షకుల నుండి నిరాశజనకమైన టాక్ ను తెచ్చుకుంది. గత కొన్ని సంవత్సరాలుగా ఇంత బ్యాడ్ టాక్ తెచ్చుకున్న సల్మాన్ మూవీ ఇదే కావడంతో, బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని సాధిస్తుందో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా సల్మాన్ చిత్రాలలో ఉండే ‘ఏమోషన్’ ఈ సినిమాలో మిస్సయిందనేది విమర్శకులు తేల్చిన అంశం.
తొలి మూడు రోజుల వరకు కలెక్షన్స్ కు డోకా లేకపోయినప్పటికీ, ఆ తర్వాత మాత్రం ఈ టాక్ తో మనుగడ సాగించడం అనేది చాలా కష్టమైన విషయంగా సినీ విశ్లేషకులు పేర్కొంటున్నారు. అయితే ఫస్ట్ డే కలెక్షన్స్ విషయంలో కూడా గత చిత్రాలతో పోలిస్తే… ‘ట్యూబ్ లైట్’ రేంజ్ తక్కువగానే కనపడుతోందని ట్రేడ్ పండితులు లెక్కలు కడుతున్నారు. అయితే పూర్తి సమాచారం తెలియడానికి ఇంకా టైం ఉందిలేండి. మూడు హ్యాట్రిక్ విజయాలను పూర్తి చేసుకున్న సల్మాన్, ‘ట్యూబ్ లైట్’తో నాలుగవ హ్యాట్రిక్ ను మిస్సయినట్లేనా!?



