టాలీవుడ్ పెద్ద స్టార్ల మీద ఓటీటీ ప్రెషర్?

salmankhan Radhe movie Effect on Tollywood bigstar moviesబాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ఖాన్‌ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా ‘రాధే’. ప్రముఖ కొరియో గ్రాఫర్, డైరెక్టర్ ప్రభుదేవా దర్శకత్వం వహించాడు. ఈద్‌ సందర్భంగా మే 13న ‘రాధే’ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఒకేరోజు థియేటర్ అండ్ ఓటీటీ రిలీజ్ చేస్తుండటం విశేషం.

ఆ రోజు థియేటర్లలో, జీప్లెక్స్ లో, అలాగే వివిధ డీటీహెచ్ ప్లాట్ ఫామ్లలో సినిమా ప్రేక్షకులకు అందుబాటులో ఉంటుంది. కోవిడ్ సెకండ్ వేవ్ వల్ల థియేటర్ బిజినెస్ లో కలిగే నష్టాన్ని భర్తీ చెయ్యడానికి ఓటీటీ, డీటీహెచ్ విడుదల ఉపయోగపడుతుందని నిర్మాతలు భావిస్తున్నారు.

ADVERTISEMENT

అయితే సల్మాన్ ఖాన్ తీసుకున్న ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఉన్న పెద్ద స్టార్ల మీద ఒత్తిడి పెరుగుతుంది. కేవలం ఒక్క తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే డజన్ సినిమాలు కరోనా కారణంగా ఏడాదికి పైగా విడుదల కాకుండా ఆగిపోయాయి. పెద్ద సినిమాలకు పెట్టే పెద్ద బడ్జెట్ కారణంగా అసలు ఓటీటీ విడుదల ఆప్షన్ అనేది వర్క్ అవుట్ కాదని చెబుతూ వచ్చారు.

అయితే సల్మాన్ ఖాన్ లాంటి పెద్ద స్టార్ సినిమా నే ఇటువంటి రూట్ తీసుకున్నప్పుడు ఇక తెలుగులో స్టార్ సినిమాలు ఇక వంకలు పెట్టే పరిస్థితి ఉండదు. రాధే విడుదలయ్యి ఆ సక్సెస్ అయితే ఇక అంతా కదలాల్సిందే. అంటే మే 13న ఇండియన్ సినిమానే ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయి.

ADVERTISEMENT
Latest Stories