తల్లి అయిన సమంత ఫ్రెండ్‌

samantha friend neeraja kona gave a birth to childటాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంతకు నీరజ కోనంకు చాలా మంచి స్నేహం ఉంది విషయం తెల్సిందే. సమంతకు చెందిన డ్రస్‌లు మరియు ఇతర స్టైలింగ్‌ అంతా కూడా నీరజ చూసుకునేది. సమంతతో పాటు ఇంకా పలువురు స్టార్‌ హీరోయిన్‌లకు సైతం ఈమె మోడ్రన్‌ డ్రస్‌లను డిజైన్‌ చేయడం జరిగింది. ఎన్నో సూపర్‌ హిట్‌ చిత్రాల్లో నటించిన హీరోయిన్స్‌కు స్టైలింగ్‌ చేసిన నీరజ గత సంవత్సరం పెళ్లి చేసుకున్న విషయం తెల్సిందే.

జూన్‌ 18, 2014లో అజయ్‌ను పెళ్లి చేసుకున్న నీరజ తాజాగా కొడుకుకు జన్మనిచ్చింది. అన్ష్‌ అని తన కొడుకుకు పేరు పెట్టినట్లుగా నీరజ కోన చెప్పుకొచ్చింది. తల్లినయినందుకు సంతోషంగా ఉంది అంటూ నీరజ కోన ట్విట్‌ చేసింది. ప్రెగ్నెట్‌ అయినందు వల్ల గత కొంత కాలంగా సినిమా పరిశ్రమకు దూరంగా ఉన్న నీరజ బాబు పెద్ద అయిన తర్వాత మళ్లీ హీరోయిన్స్‌కు స్టైలింగ్‌ చేస్తాను అంటోంది.

ADVERTISEMENT
Latest Stories