“రంగస్థలం” చిత్రంలో రామలక్ష్మి పాత్ర ద్వారా విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల ‘నాన్ బాహుబలి’ రికార్డులు సొంతం చేసుకున్న సమంత, ఆ విజయం మరువకముందే “మహానటి” రూపంలో మరో అపూర్వమైన విజయం దరిచేరింది. ‘మధురవాణి’ పాత్రలో ప్రేక్షకులను మైమరిపించిన సమంత, ఆ సినిమా సక్సెస్ సంబరాలు ఇంకా ముగియకముందే మరో సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించబోతోంది.
ఇటీవల తమిళంలో విడుదలై సక్సెస్ టాక్ ను సొంతం చేసుకున్న సినిమాను తెలుగులో “అభిమన్యుడు” రూపంలో జూన్ 1వ తేదీన విడుదల చేయనున్నారు. యువాన్ శంకర్ రాజా స్వరపరిచిన ఆడియో ఈ నెల 25వ తేదీన విడుదల కానుండగా, మరో వారానికి సినిమాను రిలీజ్ చేస్తున్నారు. చాలాకాలం నుండి టాలీవుడ్ లో సక్సెస్ కోసం నిరీక్షిస్తున్న విశాల్ కు ఈ సినిమా అయినా సానుకూల ఫలితాన్ని అందిస్తుందేమో చూడాలి.
ADVERTISEMENT
ADVERTISEMENT



