ఒక్క సమోసాతో గిన్నీస్ రికార్డ్ కే ఎసరు!

Samosa, World Big Samosa, World First Big Samosa, Huge Samosa Record, Samosa Guinness Record, Samosa Guinness Book Recordనేటి యువతరం గుర్తింపును కోరుకుంటోంది. ఆ క్రమంలో వినూత్నమైన ప్రయోగాలు చేయడానికి యువకులు పూనుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్ లోని మహారాజ్ గంజ్ జిల్లాలోని గోపాల్ నగర్ కాలనీకి చెందిన రితేశ్ సోని అనే యువకుడు ఇంటర్ పూర్తి చేసి సొంత ఊరిలో చిన్నపాటి సమోసాల దుకాణం నడుపుతున్నాడు. తన సమోసాలకు గిరాకీ పెంచుకునేందుకు ఏం చేయాలా? అని ఆలోచించిన రితేశ్ సోనీకి ‘పెద్ద సమోసా’ ఐడియా తట్టింది.

దీంతో సమోసాల చరిత్రపై ‘గూగుల్ తల్లి’లో సోదాలు చేయగా, ఇంగ్లాండ్ లోని బ్రాడ్ ఫోర్డ్ కాళాశాల విద్యార్థులు రూపొందించిన 110 కేజీల సమోసా ఇప్పటివరకు గిన్నిస్ రికార్డులకెక్కిన అతి పెద్ద సమోసా అని తెలుసుకున్నాడు. దీంతో అంతకంటే పెద్ద సమోసాను తయారు చేసి, గిన్నిస్ రికార్డులకెక్కడంతో పాటు ‘పెద్ద సమోసా దుకాణం’గా తన దుకాణానికి పేరు తీసుకురావాలని భావించాడు.

ADVERTISEMENT

స్నేహితుల సాయంతో గిన్నిస్ రికార్డు ప్రయత్నం ప్రారంభించాడు. ఇందుకోసం 90 లీటర్ల రిఫైన్డ్ ఆయిల్, 1.75 క్వింటాళ్ల గోధుమ పిండి, రెండు క్వింటాల బంగాళా దుంపలు ఉపయోగించి, 3 మీటర్ల పొడవు, రెండు మీటర్ల వెడల్పు, రెండు మీటర్ల మందం కలిగిన 332 కేజీల భారీ సమోసాను తయారుచేశాడు. దీనిని తయారు చేసేందుకు 40 వేల రూపాయలు ఖర్చయ్యాయని రితేశ్ తెలిపాడు. అయితే దీనిపై గిన్నిస్ రికార్డు అధికారులకు సమాచారం అందించామని, తమ సమోసా ‘ప్రపంచంలోనే అతిపెద్ద సమోసగా’ గుర్తింపు పొందుతుందని రితేశ్ ఆశాభావం వ్యక్తం చేశాడు.

ADVERTISEMENT
Latest Stories