ఇదేనా రిటర్న్ గిఫ్ట్..?

Sanju Samson Dropped

ఈ ఏడాది ఫిబ్రవరి-మార్చ్ భారత్ వేదికగా జరిగిన టి-20 వరల్డ్ కప్ లో ఇండియా మొదట తడపడినా, తరువాత పుంజుకుని ప్రపంచ ఛాంపియన్స్ గా నిలిచారు. ఈ ఛాంపియన్షిప్ కు జట్టులోని ఆటగాళ్లందరూ ఎంతో కష్టపడినప్పటికీ, వరల్డ్ కప్ హీరో గా ‘సంజు శాంసన్’ నిలిచాడు.

విండీస్ పై అతి-కీలక మ్యాచ్ లో 97*, సెమీస్ మరియు ఫైనల్ లో కూడా 80+ పరుగులు సాధించి భారత్ విజేత కావటంలో ముఖ్యపాత్ర పోషించాడు. ఇలా సంజు అద్భుతమైన ఆటకు తాను ‘ప్లేయర్ అఫ్ ది టోర్నీ’ అవార్డును కూడా అందుకున్నాడు.

ADVERTISEMENT

టి-20 వరల్డ్ కప్ లో మ్యాన్ అఫ్ ది టోర్నీ అవార్డును అందుకోవటం అంటే మాటలు కాదు. అది కూడా, ఛాంపియన్షిప్ తో పాటు ఈ అవార్డును అందుకోవటం సంజు కెరీర్ కు మంచి బూస్ట్ వస్తుందని ఆశించారు అందరు.

కానీ, నేటి పరిస్థితి చూస్కుంటే వరల్డ్ కప్ తరువాత ఆడిన మొదటి 3 మ్యాచ్లలో సంజు విఫలమవడంతో వచ్చే జింబాబ్వే సిరీస్ కు అతన్ని తుది-జట్టు కాదు ఏకంగా స్క్వాడ్ నుండే తొలగించారు. కొందరు దీనిని రెస్ట్ అని చెప్పుకొచ్చినప్పటికీ, దిగ్గజాలు మరియు క్రికెట్ పండితులు మాత్రం బీసీసీఐ సంజు నుండి మూవ్-ఆన్ అయిపొయింది అని స్పష్టం చేస్తున్నారు.

సరిగ్గా నెల రోజుల ముందు వరల్డ్-కప్ విన్నింగ్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కు ఇంచుమించుగా ఇదే సీన్ జరిగింది. సంజు కు 3 మ్యాచ్ల విఫలం తరువాత తీసుకున్న నిర్ణయం, సూర్య పరిస్థితిలో ఐపీఎల్ ముగియగానే తీసుకున్నారు. కనీసం వరల్డ్-కప్ అందించిన కెప్టెన్ అనే ఫీలింగ్ కూడా లేకుండా నేరుగా సూర్య ను జట్టు నుండి తొలగించారు.

కెప్టెన్సీ పగ్గాలను అయ్యర్ చేతిలో పెట్టటం జరిగినప్పుడు కూడా ఇలానే ‘సూర్య డిజర్వ్స్ బెటర్’ అంటూ సోషల్ మీడియా లో భారత అభిమానులు కామెంట్స్ చేయటం చూస్తూనే వస్తున్నాం. సూర్యకుమార్ ప్రస్తుతం తన బ్యాటింగ్ ఫామ్ తో ఇబ్బంది పడుతున్నప్పటికీ భారత్ కు ఆల్-టైం బెస్ట్ టి-20 కెప్టెన్ గా నిలిచాడు.

అతడి నేతృత్వంలో ఆడిన 8 బిలాటరల్ సిరీస్ లలో ఒక్క సిరీస్ కూడా ఓడకుండా 8 కు 8 సిరీస్ ల ను గెలిపించాడు సూర్య. అతడి అండతో ఆసియ కప్ మరియు టి-20 వరల్డ్ కప్ ఆడిన భారత్, అటు ఆసియ కప్ ఇటు వరల్డ్-కప్ రెండిటిని అందుకుని పొట్టి ఫార్మటును నిరాధికారంగా శాసించారు టీం ఇండియా.

ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్ మొదలగు అన్ని పెద్ద జట్లన్నిటిని సునాయాసంగా మట్టికరిపించారు సూర్య-సేన. కానీ, ఇంత మంచి ట్రాక్-రికార్డ్ ఉన్న ఒక కెప్టెన్ ను వరల్డ్-కప్ అందించిన తరువాతి సిరీస్ కే చోటు లేకుండా జట్టు నుండి వెలివేసింది భారత సెలెక్షన్ కమిటీ.

మరోపక్క, భారత్ బ్యాక్-టు-బ్యాక్ వరల్డ్-కప్స్ గెలవటంలో అత్యంత ముఖ్య పాత్ర పోషించిన సంజు శాంసన్ ను 3 వైఫల్యాల తరువాత జట్టునుండి నిలిపివేశారు. మరి ఇదేనా భారత సెలెక్షన్ కమిటీ తమ ఆటగాళ్లకు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ అంటూ క్రికెట్ ప్రేమికుల నుంచి అనేక కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి.

ADVERTISEMENT
Latest Stories