దర్శకత్వ పర్యవేక్షణ అని కోన ముందేం చెప్పలేదు

Sankarabharanam kona venkat nikhilప్రముఖ రచయిత కోన వెంకట్‌ నిర్మాణంలో తాజాగా తెరకెక్కిన చిత్రం ‘శంకరాభరణం’. నిఖిల్‌ హీరోగా నందిత హీరోయిన్‌గా ఉదయ్‌ నందనవనం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా విడుదల కొన్ని రోజులు ఉందనంగా కోన వెంకట్‌ దర్శకత్వ పర్యవేక్షణ అంటూ టైటిల్‌ వేస్తున్నారు. కథ, స్క్రీన్‌ప్లే, మాటలు అందించిన కోన వెంకట్‌ ఈ సినిమాను అంతా తానై ముందుండి నడిరపిచాడు అని, షాడో డైరెక్టర్‌గా వ్యవహరించాడు అంటూ కొన్ని కామెంట్స్‌ వినిపించాయి. ఈ విషయంపై తాజాగా దర్శకుడు ఉదయ్‌ క్లారిటీ ఇచ్చాడు.

దర్శకుడు ఉదయ్‌ నందనవనం ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కోన గారు దర్శకత్వ పర్యవేక్షణ వేసుకునే విషయం తనకు ముందు చెప్పలేదు అని, అయినా కోన గారు ఈ సినిమాతో ట్రావెల్‌ చేశారు. ఈ సినిమా కథ ఆయనది, మాటలు, స్క్రీన్‌ప్లే ఆయన అందించారు. షూటింగ్‌ జరుగుతున్నని రోజులు మాతో ఉన్నారు. పైగా ఆయన్ను నేను అన్నయ్య అని పిలుస్తాను, అందువల్ల ఈ సినిమాకు దర్శకత్వ పర్యవేక్షణ అని కోన గారు వేసుకుంటే నాకు ఏమీ ఇబ్బంది లేదు అని, కాకపోతే ఈ సినిమా నాది అని మాత్రం నేను చెప్పగలను అని ఉదయ్‌ చెప్పుకొచ్చాడు. కోన దర్శకత్వ పర్యవేక్షణ టైటిల్‌ వేసుకోవడం వల్ల సినిమా సక్సెస్‌ క్రెడిట్‌ అంతా కూడా ఆయనకే వెళ్లే అవకాశాలున్నాయి. మరి అప్పుడు ఉదయ్‌ ఎలా ఫీలవుతాడో చూడాలి.

ADVERTISEMENT
Latest Stories