బిగుసుకుంటున్న సంక్రాంతి బరి!

Tollywood stars gearing up for Sankranti 2027 movie clash with multiple big releases

తెలుగు చిత్రసీమకి సంక్రాంతి ఒక పెద్ద పండగ. పండగనాడు కుటుంబం మొత్తం కలిసి ఒక సినిమా చూడడం అనేది ఆనవాయితీగా మారిపోయిన ఈ సాంప్రదాయాన్ని మన దర్శకనిర్మాతలు గట్టిగానే క్యాష్ చేసుకుంటారు. సంక్రాంతికి సినిమాలు ఆడాలంటే బ్లాక్ బస్టర్లు మాత్రమే అక్కర్లేదు, ఏమాత్రం బాగున్నా కలెక్షన్లు కొల్లగొట్టడం ఖాయం.

అందుకే ఒక్కోసారి సినిమాల్ని చుట్టేసి కంగారుగా సంక్రాంతికి విడుదల చేసేస్తూ ఉంటారు. గత రెండుమూడేళ్లుగా ఈ సంక్రాంతి పోటీ మరింత రంజుగా మారింది. అందుకు ఓ కారణం అనిల్ రావిపూడి అని చెప్పొచ్చు. “సంక్రాంతికి వస్తున్నాం, మన శంకర వరప్రసాద్ గారు” సినిమాలతో అనిల్ రావిపూడి సంక్రాంతికి బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టడాన్ని స్ఫూర్తిగా తీసుకొని, మిగతా స్టార్లు, డైరెక్టర్లు కూడా సంక్రాంతి రిలీజ్ కోసం ఎగబడుతున్నారు.

ADVERTISEMENT

ఈ క్రమంలో ఆల్రెడీ 2027 సంక్రాంతికి ప్రస్తుత తెలుగు సినిమా నాలుగు స్తంభాలైన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ తమ సినిమాలతో రెడీ అవుతుండగా.. కొంతమంది యువ కథానాయకులు కూడా ఈ బరిలో దిగేందుకు సన్నద్ధమవుతున్నారు. అందులో శర్వానంద్ ముందంజలో ఉన్నాడు. ఈ ఏడాది “నారీ నారీ నడుమ మురారి”తో హిట్టు కొట్టి మళ్లీ ఫామ్ లోకి వచ్చిన శర్వానంద్, 2027 సంక్రాంతిని టార్గెట్ చేస్తున్నాడు. శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ త్వరలో మొదలుకానుంది.

ఇకపోతే.. ఇవాళ (మార్చి 28) పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ప్రారంభమైన వరుణ్ తేజ్ సినిమా “బరి” కూడా సంక్రాంతి సీజన్ ను టార్గెట్ చేయనుందని తెలుస్తోంది. నిర్మాత నిహారిక కొణిదెల, హీరో వరుణ్ తేజ్ ఈ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ కూడా చేశారు. అయితే.. వరుణ్ తేజ్ కి ఇది మొదటి సోలో సంక్రాంతి రిలీజ్. ఎలా నెగ్గుకొస్తాడు అనేది చూడాలి.

అయితే.. 2027 సంక్రాంతి బరిలో డబ్బింగ్ సినిమాలు కూడా నిలిచే అవకాశం ఉంది. రజనీకాంత్ సినిమా కూడా వస్తుందని టాక్ వినిపిస్తోంది. మరి ఇన్ని సినిమాలని సంక్రాంతి మార్కెట్ ఎలా తట్టుకుంటుంది అనేది చూడాలి.

ADVERTISEMENT
Latest Stories