సప్తగిరి “సెన్సేషన్” రివీల్ అయ్యింది! హీరో కాదు!

saptahgiri-made it clear about hero rumors‘బొమ్మరిల్లు’ భాస్కర్ తెరకెక్కించిన “పరుగు” చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చిన సప్తగిరి కెరీర్ ను “ప్రేమకధాచిత్రమ్” మలుపు తిప్పింది. అప్పటి నుండి యూత్ ఫేవరేట్ కమెడియన్ గా మారిన సప్తగిరికి ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి డిమాండ్ ఉంది. అయితే ఇప్పుడిప్పుడే కమెడియన్ వెండితెరను ఏలుతున్న దశలో, ఏకంగా హీరోగా చేయబోతున్నాడన్న వార్తలు గుప్పుమన్నాయి. అంతేకాదు, సాగర్ దర్శకుడు, ఏఎస్ రవికుమార్ చౌదరి నిర్మాత అని సమాచారం కూడా వచ్చింది. వెబ్ మీడియా వ్యాప్తంగా హల్చల్ చేసిన ఈ విషయం సప్తగిరి దాకా చేరడంతో దీనిపై స్పష్టత ఇచ్చారు.

“తను హీరోగా ఓ సినిమా చేస్తున్నానని వస్తున్న వార్తలు నిజం కాదని, కామెడీ రోల్స్ చేయడమే తనకు ఎంతో హ్యపీగా ఉందంటూ” సోషల్ మీడియా వేదికగా సప్తగిరి క్లారిటీ ఇచ్చాడు. అందరి ఆశీర్వాదాలతో తాను హాస్యనటుడిగా మరింత పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నట్టు చెప్పాడు. సప్తగిరి ఇచ్చిన తాజా ప్రకటనతో ఈ పుకార్లకు తెరపడినట్లయ్యింది. ‘హీరో’ అనే ఇమేజ్ ను పక్కన పెట్టి సప్తగిరి ఓ మంచి నిర్ణయం తీసుకున్నారంటూ సినీ విశ్లేషకులే కాదు, అభిమాన వర్గం కూడా హర్షం వ్యక్తం చేస్తోంది. ఎందుకంటే, కమెడియన్లు హీరోలుగా మారిన తర్వాత వారి కెరీర్ లు ఏమయ్యాయో అందరికీ తెలిసిన విషయమే!

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories