రజనీకాంత్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన శరత్ కుమార్!

Sarathkumar On Rajinikanth As CM Candidate‘సూపర్ స్టార్’ రజనీకాంత్ కున్న క్రేజ్ గురించి ఈ రోజు ప్రత్యేకంగా చెప్పుకునేది ఏముంది? పోటీ చేస్తే తమిళనాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిపోవచ్చన్న టాక్ రజనీ సొంతం. ఇప్పుడే అదే రజనీపై విమర్శలకు కారణం అయ్యింది. జయలలిత మరణం తర్వాత తమిళనాడులో ఏర్పడిన రాజకీయ సంక్షోభం రీత్యా, మళ్ళీ సూపర్ స్టార్ పేరు పొలిటికల్ తెరపై సందడి చేస్తోంది. అయితే తానూ రాజకీయాల్లోకి వచ్చేది లేదని గతంలో చాలా సందర్భాలలో చెప్పినప్పటికీ, జయలలిత మరణం ఇందుకు ఊతమిచ్చింది.

రజనీ వస్తారో లేదో గానీ, వస్తే గనుక ఖచ్చితంగా అడ్డుకుని తీరతానని మరో నటుడు శరత్ కుమార్ హెచ్చరించడం పెను దుమారాన్ని రేపుతోంది. రజనీకాంత్ కు తమిళనాడు ప్రజల కష్టాలు, కన్నీళ్ల గురించి తెలియవు. సూపర్ స్టార్ గా, నటుడిగా రజనీకాంత్ పై నాకు గౌరవం ఉంది. అయితే, రాజకీయాల్లోకి వస్తానంటే మాత్రం కుదరదు. ఎందరో మహా నేతలు జన్మించిన తమిళనాడు గడ్డపై ఒక వారం రోజులు, మరో వారం కర్ణాటకలో ఉండే రజనీకాంత్ కు సీఎం అయ్యే అర్హత లేదు… అంటూ శరత్ కుమార్ నిప్పులు చెరిగారు. తమిళ సంప్రదాయాలపై ఆయనకు అవగాహన లేదని, ఈ విషయం ఎంతో మందికి తెలుసునని చేసిన వ్యాఖ్యలు స్థానికంగా కలకలం రేపుతున్నాయి.

ADVERTISEMENT

‘తుగ్లక్’ పత్రిక వార్షికోత్సవం సభ వేదికగా పలువురు నేతలు రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాల్సిందేనని ఒత్తిడి చేయగా, దీనిపై శరత్ కుమార్ చేసిన సంచలన వ్యాఖ్యలపై మండిపడుతున్న రజనీకాంత్ అభిమాన సంఘాలు రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలకు దిగాయి. శరత్ కుమార్ దిష్టి బొమ్మలను దగ్ధం చేస్తూ, రోడ్లపై ధర్నాలు జరుగుతున్నాయి. రజనీకాంత్ అభిమానులను అడ్డుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. కాగా, ఈ విషయంలో రజనీ మాత్రం ఇంకా స్పందించలేదు.

ADVERTISEMENT
Latest Stories