‘సర్ధార్’ సెకండ్ వీక్ పోస్టర్ పడింది!

Sardaar-Gabbar-Singh-2nd week poster‘హార్డ్ కోర్’ పవర్ స్టార్ అభిమానుల ఆదరణ పొందిన ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ ఫలితం బాక్సాఫీస్ వద్ద నిరాశజనకంగా ఉన్నప్పటికీ, కొన్ని ప్రధాన సెంటర్లలో పర్వాలేదనిపించే విధంగా ఉండడంతో ‘సర్ధార్’ రెండవ వారం పోస్టర్ పడింది. గతంలో అయితే రోడ్ల మీద వారం వారం పోస్టర్లను అతికించి సినిమాకు మరింత పబ్లిసిటీ తీసుకువచ్చేవారు. కానీ, ప్రస్తుతం అది గత వైభవమే.

పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం పుణ్యమా అంటూ సోషల్ మీడియాలలో చిత్ర యూనిట్ పోస్టర్లను విడుదల చేయడం వరకే పరిమితమవుతోంది. ఒక్క ‘సర్ధార్’ మాత్రమే కాదు, ఇటీవల భారీ హిట్టు అందుకున్న ‘సోగ్గాడే చిన్నినాయనా’ 50 రోజుల పోస్టర్ కూడా ఎక్కడా తారసపడలేదు, ఒక్క సోషల్ మీడియాలో తప్ప! అయితే సోషల్ మీడియాలో ఎప్పుడూ సందడి చేసే పవన్ అభిమానులు ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ పోస్టర్ ను షేర్ చేసుకుంటూ ‘శ్రీరామనవమి’ పర్వదినాన్ని జరుపుకుంటున్నారు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories