బెనిఫిట్ షోలు… మహా డేంజర్ గురూ..!

sardaar gabbar singh benefit showsపవన్ మేనియాతో ఊగిపోతున్న అభిమాన గణాన్ని పవర్ స్టార్ 7వ తేదీ అర్ధరాత్రే పలకరించనున్నాడు. ఏపీ, తెలంగాణా వ్యాప్తంగా పెద్ద ఎత్తున బెనిఫిట్ షోలకు అనుమతులు లభించాయి. ఒక్క కృష్ణాజిల్లాలోనే దాదాపుగా 50కి పైగా బెనిఫిట్ షోలు ప్రదర్శించనున్నారు. ఇక, రెండు రాష్ట్రాలలోనూ కలిపితే ఒక సాధారణ స్థాయి సినిమా విడుదల ఎలా ఉంటుందో, ఆ రేంజ్ లో బెనిఫిట్ షోలు సిద్ధమయ్యాయి. అంటే దాదాపుగా 7వ తేదీ అర్ధరాత్రి నుండే ‘సర్ధార్’ హంగామాకు ముహూర్తం పెట్టారు.

ADVERTISEMENT

అయితే ఈ బెనిఫిట్ షోల ప్రదర్శన చాలా డేంజర్ తో కూడుకున్న అంశం. సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుందనే గట్టి నమ్మకం ఉంటే తప్ప, బెనిఫిట్ షోల కోసం చిత్ర యూనిట్ ముందుకు రావడం లేదు. ఇటీవల కాలంలో ‘క్షణం, ఊపిరి’ వంటి కధాబలం ఉన్న సినిమాలు మాత్రమే ఈ బెనిఫిట్ షోలను ప్రదర్శించారు. అయితే అవి కూడా కేవలం హైదరాబాద్ వంటి ఒకటి, రెండు చోట్ల మాత్రమే పరిమితమైంది. గతంలో ఒక్క బెనిఫిట్ ద్వారానే సినిమా ఫలితాన్ని శాసించిన సందర్భాలు ఉన్నాయి.

విజయవాడ వేదికగా సినిమా విడుదలకు ముందు రోజు రాత్రి ప్రదర్శితమైన ప్రిన్స్ మహేష్ బాబు “ఖలేజా” బెనిఫిట్ షో మొత్తం సినిమా ఫలితాన్నే తారుమారు చేసింది. భారీ అంచనాలతో ధియేటర్ కు వెళ్ళిన ప్రేక్షకుడికి కామెడీ తారసపడడంతో బెనిఫిట్ షో నుండి ఆశించిన టాక్ వెలువడలేదు. అయితే ఈ టాక్ ఉదయం కల్లా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం కావడంతో సినిమా ఓపెనింగ్స్ పై తీవ్ర ప్రభావం చూపాయి. ఇది ఒక్క “ఖలేజా” సినిమా వరకే పరిమితం కాలేదు, అంతకుముందు చాలా సినిమాల పరిస్థితి ఇంతే.

అయితే ‘ఖలేజా’ ఫలితం సినీ వర్గాలకు ‘జ్ఞానోదయం’ కలిగించింది. దీంతో అప్పటి నుండి ముందు రోజు రాత్రి బెనిఫిట్ షోల ప్రదర్శనలకు ‘శుభంకార్డు’ వేసారు. కానీ, తాజాగా ‘సర్ధార్ గబ్బర్ సింగ్’తో మళ్ళీ అలాంటి ప్రక్రియకు శ్రీకారం చుట్టబోతున్నారు. అది కూడా భారీ స్థాయిలో..! సినిమా బాగుంటే ఈ బెనిఫిట్ షోల టాక్ మరిన్ని కలెక్షన్స్ ను తెచ్చి పెడుతుందని చెప్పడంలో సందేహం లేదు. కానీ, ఫలితం తారుమారు అయితే మాత్రం మొదటికే మోసం వచ్చే ప్రమాదం కూడా పొంచి ఉంది. మరి ‘సర్ధార్’ బెనిఫిట్ షోలు ఎలాంటి ఫలితాన్ని ఇస్తాయో మరికొద్ది గంటల్లో తేలిపోనుంది.

ADVERTISEMENT
Latest Stories