‘సర్ధార్’ క్రేజ్ ను నిదర్శనం… నడిరోడ్డులో అలా..!

sardaar gabbar singh crazeపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ సినీ మేనియా అభిమానులను ఊపేస్తోంది. ఇలాంటి సందర్భాలలో సహజంగా ధియేటర్ల వద్ద రచ్చ రచ్చ చేయడం అభిమానులకు ఆనవాయితీనే. అయితే హైదరాబాద్ వంటి అల్ట్రా మోడరన్ సిటీస్ లో అయితే ‘ఫ్లాష్ మాబ్’ పేరుతో ప్రసాద్ ఐమాక్స్ వంటి కాంప్లెక్స్ లలో డ్యాన్స్ లు వేయడం పరిపాటి. అయితే అలాంటి ‘ఫ్లాష్ మాబ్’ రాజమహేంద్రవరం వేదికగా జరిగితే ఎలా ఉంటుంది..!

ఈ ఫోటోలు ఆ సందర్భంలోనివే. ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ టైటిల్ పాటలో పిల్లలతో కలిసి పవన్ వేసిన స్టెప్పులను అనుకరిస్తూ నడిరోడ్డుపై పిల్లలతో చేసిన ఈ ‘ఫ్లాష్ మాబ్’ వీక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా ‘సర్ధార్’ గెటప్ లోనే అందరూ దర్శనమివ్వడంతో పవన్ అభిమానులు కూడా జత కలిసారు. మొత్తానికి విడుదలకు ముందు ‘సర్ధార్’ ఓ రేంజ్ లో సందడి చేస్తున్నాడు. పవర్ స్టార్ క్రేజ్ కు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి..!

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories