బన్నీ ఆర్మీ లుక్ తో సరిలేరు కంపేరిజన్… రంద్రాన్వేషణా?

Sarileru-Neekevvaru Mahesh-Babu-Army-Dress-compares with allu arjun naa peru suryaఈరోజు సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఆయన తదుపరి చిత్రం, సరిలేరు నీకెవ్వరు చిత్ర బృందం అభిమానులను ఓ కానుకను అందజేసింది. ఈ చిత్రానికి సంబంధించి మహేష్‌ బాబు లుక్‌ను ది ఇంట్రో పేరుతో ఈరోజు ఉదయం విడుదల చేశారు. ఆర్మీ మేయర్‌ లుక్‌లో మహేశ్‌ చాలా స్టైలిష్‌గా ఉన్నాడు. సరిలేరు నీకెవ్వరు.. నువ్వేళ్లే రహదారికి జోహర్లు, ఎనలేని త్యాగానికి నువ్వే మారు పేరు అంటూ సాగే బ్యాగ్రౌండ్‌ బిట్‌ అభిమానులను ఆకట్టుకుంటుంది.

అయితే మహేష్ బాబు లుక్ ని కొందరు నా పేరు సూర్యలో అల్లు అర్జున్ లుక్ తో కొందరు కంపేర్ చేస్తున్నారు. ఆర్మీ లుక్ కోసం ఆ సినిమాలో బన్నీ ఆర్మీ కట్ చేయించుకుని, బాడీ పెంచి నిజంగానే ఆర్మీ వ్యక్తిగా కనిపించారని, అయితే మహేష్ బాబు మాత్రం ఆర్మీ డ్రెస్ వెయ్యడం తప్ప ఆ పాత్ర కోసం చేసింది ఏమీ లేదని కొందరు ఆరోపించారు. వారు చెప్పింది కొంత మేర నిజమే అయినా అది మరి రంద్రాన్వేషణ అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.

ADVERTISEMENT

ఆర్మీ లుక్ లో మహేష్ బాబు బావున్నాడు అంతకు మించి మాములు ఆడియన్స్ పట్టించుకోరని వారు అంటున్నారు. ఈ చిత్రంలో మహేష్‌ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్నారు. ప్రముఖ నటి విజయశాంతి ఈ చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తున్నారు. ‘దిల్‌’ రాజు, రామబ్రహ్మం సుంకర, మహేశ్‌ బాబు నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు.ఈ సినిమాను 2020 సంక్రాంతి కానుకగా ప్రేక్షకులు ముందుకు తీసుకురానున్నట్టు చిత్ర బృందం ఇదివరకే ప్రకటించింది.

ADVERTISEMENT
Latest Stories