యుఎస్ లో భారీగా ప్లాన్ చేసారంట!

Sarkar to Be Better Than Two AR Murugadoss' Moviesతమిళ స్టార్ హీరో విజయ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన “సర్కార్” ఫస్ట్ లుక్ అభిమానులతో పాటు సందర్శకులను కూడా విశేషంగా అలరించింది. ముఖ్యంగా ‘స్పైడర్’ వంటి దారుణమైన సినిమాను తెరకెక్కించిన మురుగదాస్ నుండి హీరోయిజంతో కూడిన పోస్టర్ రావడంతో విజయ్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే సోషల్ మీడియాలో మహేష్ ఫ్యాన్స్ మురుగదాస్ ను మళ్ళీ వేసుకున్నారనుకోండి.., అది వేరే విషయం..!

ఇదిలా ఉంటే, ఈ సినిమాలో విజయ్ ఇంట్రడక్షన్ సాంగ్ కోసం చిత్ర యూనిట్ అమెరికా పయనం అవనుంది. విజయ్ మాస్ ఫ్యాన్స్ ను ఒక ఊపు ఊపేలా భారీ స్థాయిలో అమెరికాలో ఈ పాటను షూట్ చేయబోతున్నారని కోలీవుడ్ సమాచారం. ‘తుపాకీ, కత్తి’ వంటి రెండు బ్లాక్ బస్టర్ సక్సెస్ లు తమ ఖాతాలో వేసుకున్న విజయ్ – మురుగ కాంబోలో హ్యాట్రిక్ మూవీగా రాబోతున్న “సర్కార్” సినిమాపై అభిమానులతో పాటు కోలీవుడ్ ట్రేడ్ లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories