గత కొంతకాలంగా తన కుమారుడి ఆడియో వేడుకలకు మాత్రమే విచ్చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి ఇటీవల తన సోదరుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ ఆడియో వేడుకలో ప్రత్యక్షం అయ్యి, మెగా అభిమానులను ఉత్సాహపరిచారు. అయితే ఇది ఒక్క ‘సర్ధార్’ వరకే పరిమితం కావట్లేదు… ఈ నెల 10వ తేదీన విశాఖపట్టణం వేదికగా జరగనున్న ‘సరైనోడు’ ప్రీ రిలీజ్ వేడుకలో కూడా మెగాస్టార్ భాగస్వామి కాబోతున్నాడు.
దీనికి సంబంధించిన ప్రచారం ఊపందుకుంది. విశాఖ వేదికగా “సరైనోడు” భారీ ఫ్లెక్సీలు అభిమానులను నూతన ఉత్సాహంలో ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా చిరు మాదిరి ఓ మాంచి మాస్ లుక్ లో దర్శనమిస్తున్న అల్లు అర్జున్ పోస్టర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ కటౌట్లో మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథి అని ఖరారు చేయడంతో… ఈ వేడుకపైన అయినా తన 150వ సినిమా ప్రకటన అధికారికంగా చిరు చెప్తారేమోనని ఎదురు చూస్తున్నారు. ఆర్.కే.బీచ్ రోడ్ లో జరగనున్న ఈ వేడుక కోసం నగరమంతా భారీ ఫ్లెక్సీలతో ప్రచారం చేస్తున్నారు.



