అబ్బో… అల్లు అర్జున్ మీసం మేలేసాడుగా..!

Sarrainodu Audio on 1st Aprilబోయపాటి శ్రీను దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న “సరైనోడు” సినిమా ఆడియో ఏప్రిల్ 1వ తేదీ నుండి నేరుగా మార్కెట్ లో లభ్యం కానుంది. ఇప్పటికే విడుదల చేసిన ‘బ్లాకు బస్టరే’ పాట మాస్ వర్గీయులను ఆకట్టుకోగా, యస్.యస్.థమన్ స్వరపరిచిన ఆడియో నేరుగా మార్కెట్ లో విడుదల చేస్తున్నామని, తాజాగా “సరైనోడు”కు సంబంధించి ఒక పోస్టర్ ను విడుదల చేసారు.

‘స్టైలిష్ స్టార్’ అన్న పదానికి సరిగ్గా సరిపోయేలా కొత్త హెయిర్ స్టైల్ తో దర్శనమిస్తున్న అల్లు అర్జున్ మీసాలు మేలేయడం అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. బోయపాటి సినిమాలంటే హీరోలు మీసాలు మేలేయాల్సిందే అన్న నానుడి ‘సరైనోడు’ సినిమాలో కూడా కొనసాగించారన్న మాట. మరి మీసాలు మేలేసిన బన్నీ చేసే రచ్చ ఏంటో తెలియాలంటే ఏప్రిల్ 22 వరకు వెయిట్ చేయాల్సిందే.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories