యువ హీరో శర్వానంద్ సినిమా ‘రన్ రాజా రన్’తో టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా అడుగుపెట్టిన శీరత్ కపూర్ కు, ఆ తర్వాత పెద్దగా అవకాశాలు రాలేదు. వచ్చిన ఒకటి అర సినిమాలైన ‘టైగర్, కొలంబస్’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ కావడంతో, అవకాశాల శాతం మరింతగా తగ్గిపోయాయి. అయితే ఎట్టకేలకు ఓంకార్ దర్శకత్వంలో కింగ్ నాగార్జున నటిస్తున్న “రాజు గారి గది 2” సినిమాలో కీలక అవకాశం పొందిన శీరత్, ఈ సినిమాపై బోల్డెంత నమ్మకాన్ని పెట్టుకుంది.
ఓ పక్కన ఇలా అరకొర సినిమాలు చేస్తున్న శీరత్ కపూర్, మరిన్ని అవకాశాల కోసం సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తోంది. ఇటీవలే ఓ హాట్ ఫోటోషూట్ ను సిద్ధం చేసి వదిలిన శీరత్, తాజాగా ఓ పొట్టి డ్రెస్ లో సందడి చేసింది. మళ్ళీ షూటింగ్ కు సిద్ధమయ్యానని చెప్తూ, పోస్ట్ చేసిన ఈ బ్యూటీ బొమ్మలా మెరుస్తోంది. బహుశా ‘రాజు గారి గది 2’లో తను ఎలా ఉండబోతున్నానో, ఇలాంటి ఫోటోల ద్వారా ఈ ముద్దుగుమ్మ పరోక్షంగా చెప్తుందేమో..!




