టీఆర్ఎస్ 100 సీట్లకు మరో సవాల్!

shabbir ali challenges TRSజీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ వంద సీట్లు గెలవకుంటే రాజీనామా చేస్తానని మంత్రి కేటీఆర్ ప్రకటించిన సంగతి రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. ఇప్పటికే ఈ అంశంపై తెలుగుదేశం పార్టీ నేతలు కేటీఆర్ కు సవాల్ విసరగా, తాజాగా కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ లైన్ లోకొచ్చారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ వంద సీట్లు గెలిస్తే గనుక తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని విలేకరుల సమావేశంలో స్పష్టం చేశారు. ఒకవేళ గెలవకుంటే మంత్రి కేటీఆర్ రాజీనామా చేస్తారా? అని ప్రశ్నించారు. మరి ఈ సవాల్ కు మంత్రి గారి ప్రతిస్పందన ఎలా ఉంటుందో చూడాలి.

ADVERTISEMENT

ఇదిలా ఉంటే, గ్రేటర్ పరిధిలోని వంద డివిజన్లను వారం రోజుల్లో చుట్టేస్తామని టీఆర్ఎస్ ఎంపీ కవిత తెలిపారు. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ 100 స్థానాల్లో తప్పక విజయం సాధిస్తుందని, తన సోదరుని మాటలను పునరావృతం చేసారు. ఈ మేరకు హైదరాబాదులోని అన్ని డివిజన్లలోనూ మంత్రి కేటీఆర్, శ్రీనివాస్ రెడ్డి, తాను పర్యటించనున్నామని, ఈ సందర్భంగా పలు రోడ్ షోలు నిర్వహిస్తామని ఆమె తెలిపారు. గ్రేటర్ హైదరాబాదును అభివృద్ధి చేస్తే తెలంగాణను అభివృద్ధి చేసినట్టేనని, టీఆర్ఎస్ పార్టీ హైదరాబాదు అభివృద్ధికి కట్టుబడి ఉందని, ఇతర పార్టీలకు ఓటు వేసి, తమ ఓటును వృధా చేసుకోవద్దని ఆమె సూచించారు.

ADVERTISEMENT
Latest Stories