ఇప్పుడే కాదు… ఎప్పటికీ రాజకీయాల్లోకి రానన్న టాప్ హీరో!

Shah-Rukh-Khan-no-to-Politicsఒక స్థాయికి ఎదిగిన తర్వాత సినీ సెలబ్రిటీలంతా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం ఇటీవల కాలంలో సర్వసాధరణంగా మారింది. అయితే తానూ మాత్రం ఎన్నటికీ పొలిటిక్స్ వైపుకు కన్నెత్తి చూసేది లేదని తేల్చిచెప్పేశారు బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్. ముంబైలో ‘రయీస్’ సక్సెస్ మీట్ లో మాట్లాడిన షారుక్… తాను కేవలం ఒక నటుడిని మాత్రమేనని, తన జీవితాంతం నటిస్తూనే ఉంటాను తప్ప, రాజకీయాల్లోకి ప్రవేశించనని స్పష్టంగా చెప్పేసారు.

తనకు రాజకీయాల గురించి తెలియదని, అస్సలు అవగాహన లేదని, అలాగే తెలుసుకోవాలన్న ఆసక్తి కూడా లేదని అన్నారు. అలాగే ‘కాబిల్’ వివాదంపై మాట్లాడుతూ, బాలీవుడ్ లో ప్రతి సినిమాకు ఒక స్థానం ఉంటుందని, అలాగే బిజినెస్ కూడా జరుగుతుందని, ఏ సినిమా కూడా మరో సినిమాకు పోటీ కాదని, అలాగే బిజినెస్ ను కూడా దెబ్బతీయదని చెప్పాడు. అయితే ‘రయీస్’ తాము ఊహించినదాని కంటే కూడా ఎక్కువ వసూళ్లు సాధించిందని మాత్రం షారుక్ సంతోషం వ్యక్తం చేసారు.

ADVERTISEMENT

ADVERTISEMENT
Latest Stories