ఫస్ట్ లుక్ – టైటిల్ కు తగ్గట్లు ఉంది!

Shailaja Reddy Alludu First Look Poster talkఅక్కినేని నాగచైతన్య హీరోగా మారుతీ దర్శకత్వం వహిస్తోన్న “శైలజారెడ్డి గారి అల్లుడు” ఫస్ట్ లుక్ పోస్టర్స్ ను చైతూ తన ట్విట్టర్ ఖాతా ద్వారా విడుదల చేసారు. “ఆఫ్ స్క్రీన్ లో తనకు వినోదాన్ని అందిస్తోన్న మారుతీ, ఆన్ స్క్రీన్ లో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతున్నారంటూ ఈ సినిమా ఫస్ట్ లుక్ కు సంబంధించి రెండు పోస్టర్స్ ను విడుదల చేసాడు చైతూ.

ఒకటి హీరోగా చైతూ నిల్చున్న సింగిల్ పోస్టర్ కాగా, మరొకటి టైటిల్ కు సరిపోయే విధంగా హీరోయిన్ అను ఇమ్మానుయెల్ తో కలిసి ‘శైలజారెడ్డి’ పాత్ర పోషిస్తోన్న రమ్యకృష్ణ వెనుక ఫ్రెష్ లుక్ లో కనిపిస్తున్నాడు చైతూ. సితార ఎంటర్టైన్మెంట్ సంస్థతో పని చేయడం బాగుందని, అను ఇమ్మానుయెల్, రమ్యకృష్ణల కోసం వేచిచూడండి అంటూ చైతూ చేసిన ట్వీట్ తో ‘ఈ సారి గ్యారెంటీగా కొడుతున్నాం’ అంటూ ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోతున్నారు

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories