ఓటమి అక్కసు షర్మిలను ఊరికే ఉండనిస్తుందా.?

Sharmila

వైస్ జగన్ తో ఉన్న తండ్రి ఆస్తి హక్కుల పోరులో తల్లి విజయలక్ష్మి, చెల్లి షర్మిల పై జగన్ న్యాయపోరాటంలో కాస్త పై చేయి సాధించారు. ఈ కేసులో న్యాయస్థానాలు జగన్ కు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో జగన్ చట్టపరంగా గెలిచినా రాజకీయంగా పోరాడక తప్పని పరిస్థితి.

సరస్వతి షేర్ల వివాదంలో నేడు జగన్ కు అనుకూలంగా కోర్ట్ తీర్పు ఇవ్వడంతో ఇక పై షర్మిల జగన్ ను ఎలా ఎదుర్కోనున్నారు అనే చర్చ తెర మీదకొస్తుంది. న్యాయం జగన్ వైపే ఉంది, ఇందులో షర్మిల ఆరోపణలు, విజయలక్ష్మి వాదనలు అవాస్తవాలు అంటూ వైసీపీ ప్రచారం చేయక మానదు.

ADVERTISEMENT

అలాగే తనకు లేని హక్కుల కోసం షర్మిల చేస్తున్న రాజకీయమిది అంటూ షర్మిలను టార్గెట్ చేస్తూ వైసీపీ సోషల్ మీడియా రెచ్చిపోయే అవకాశము ఉంది. ఇప్పటికే కాలకేయ సైన్యం మాదిరి వైసీపీ సోషల్ మీడియా నన్ను నా కుటుంబాన్ని వెంటాడుతుంది అంటూ షర్మిల పలుమార్లు తన ఆవేదనను బహిర్గతం చేసిన సందర్భాలు ఉన్నాయి.

ఈ సమయంలో వైసీపీ షర్మిల మీద చేసే విమర్శలలో కాస్త డోసు పెంచే అవకాశం లేకపోలేదు. వైస్ జగన్ కు అండగా వైసీపీ పార్టీ మద్దతుదారులు, ఆయనకు మద్దతుగా గళం విప్పడానికి వైసీపీ నాయకులు సిద్ధంగా ఉంటారు.

దానికి తోడు జగన్ కు సాక్షి తో పాటుగా నీలి మీడియా సహకారం కూడా పూర్తిలో అందనుంది. ఇలా ఎటువైపు నుంచి చూసిన షర్మిల జగన్ ను ఎదుర్కోవడం అంటే రాయి కొండను ఢీ కొట్టడం కిందకే వస్తుంది.

అయితే షర్మిలకు ఆర్థికంగా, రాజకీయంగా, మీడియా పరంగా పెద్దగా అండ లేకపోయినప్పటికీ వైఎస్ఆర్ ముద్దుల కూతురుగా, వైసీపీ విజయం కోసం, అన్న ముఖ్యమంత్రి పదవి కోసం వేల కిలోమీటర్లు పాదయాత్ర చెల్లెలుగా, ఆడపడుచుగా ప్రజలలో షర్మిల పట్ల సానుభూతి ఉన్నమాట వాస్తవం.

అదే ఆమెకు ఆయుధం కానుంది. ఇన్నాళ్లు తన రాజకీయ ఎదుగుదల కన్నా తన ప్రత్యర్థిగా భావించే అన్న జగన్ మోహన్ రెడ్డి పతనాన్నే ఎక్కువగా కాంక్షించిన షర్మిల ఇప్పుడు ఓటమి అక్కసుతో మౌనంగా ఉంటుందా.? ఉండే అవకాశం ఉంటుందా.? అన్న అనుమానాలు అటు వైసీపీ ని సైతం భయపెడుతున్నాయి.

షర్మిల ఓటమి భారం పులివెందుల రహస్యాలను బట్టబయలు చేస్తాయా.? వివేకా హత్య వెనుక ఉన్న చిదంబర రహస్యాలు ఇంకేమైనా బయటకొస్తాయా.? తాడేపల్లి ప్యాలస్ అంతర్గత వ్యవహారాలు బయటపడతాయా.? అన్న ఆందోళన వైసీపీని సైతం వెంటాడే అవకాశం ఉంది.

ABN ఇంటర్ వ్యూ తో అన్న మీద రాజకీయ యుద్ధం మొదలు పెట్టిన షర్మిల ఇప్పుడు ఏ మీడియా సహకారం తీసుకోనుందో.? అందులో ఇంకెన్ని విషయాలు పంచుకోనుందో.? వైసీపీ మీద, అన్న జగన్ మీద ఇంకెన్ని ఆరోపణలు చేయనున్నారో.

ADVERTISEMENT
Latest Stories