సక్సెస్ మీట్స్…అప్డేట్ అవుతున్నాయా?

sharwanand accepts padi padi leche manasu failureఒక సినిమా హిట్టా? లేక ఫట్టా? అనేది ఆ సినిమా కొనుక్కున్న వాళ్ళు బ్రేక్ ఈవెన్ అయితే కానీ చెప్పలేని విషయం. కానీ ఈ రోజుల్లో సినిమా హిట్ అయినా లేకున్నా..సక్సెస్ మీట్స్ అంటూ నిర్మాతకు మరింత భారాన్ని అందిస్తున్నారు హీరోలు.

[m9ad]

ADVERTISEMENT

అయితే సినిమా సక్సెస్ మీట్ అంటే పచ్చడైపోయిన సినిమాలు.. ‘వాహ్-వా…వాహ్-వా’ అంటూ పొగడడమే అన్న మాట..కానీ ఈ ఫార్మాట్ మారుతుంది..సక్సెస్ మీట్స్ అంటే కేవలం డబ్బా కొట్టుకోవడమే కాదు..ఆ మీట్స్ ఆధారంగా సినిమా హీరోలు…లేదా సినిమా యూనిట్ మనసు విప్పి ప్రేక్షకులకు పొరపాట్లు పంచుకోవచ్చు అని సైతం తెలుస్తుంది..

తాజాగా మన యువ హీరోల సినిమా సక్సెస్ మీట్లే వాటికి సాక్ష్యం..ఒక పక్క పడి పడి లేచే మనసు..మరో పక్క అంతరిక్షం, ఈ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద చతికిల పడ్డాయి…

అయితే సక్సెస్ మీట్ లో మాత్రం ఈ సినిమా హీరోలు సినిమాలో జరిగిన పొరపాట్లను గుర్తించాం అని..అయితే ఆ పొరపాట్లు రాకుండా చూసుకుంటాం అని..ఈ పొరపాట్లను పాఠాలుగా భావించి ముందుకు సాగుతాం అని తెలపడం చూస్తే…నిజంగా ఈ తరం హీరోలు..అదే క్రమంలో సక్సెస్ మీట్లు కూడా బాగా అప్డేట్ అవుతున్నాయి అని ఆనందించాలి,

ADVERTISEMENT
Latest Stories