హను రాఘవపూడి! అందాల రాక్షసి సినిమాతో మంచి టేస్ట్ ఉన్న దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ఈ కుర్ర దర్శకుడు ఆతర్వాత నానితో చేసిన కృష్ణ గాడి వీర ప్రేమ గాధతో మంచి టాలెంట్ ఉన్న దర్శకుడిగా మారిపోయాడు. అయితే లై తో సరికొత్త ప్రయోగానికి నాంది పలికిన ఏ దర్శకుడు..ఆ మేరకు సక్సెస్ మాత్రం కాలేకపోయాడు. ఆ సినిమా కమర్షియల్ సక్సెస్ కాకపోవడంతో ఈ దర్శకుడు ఫ్లాప్ బాట బట్టక తప్పలేదు.
[m9ad]
ఇక ఈ క్రమంలో పడి పడి లేచే మనసు అంటూ శర్వానంద్ ను ముస్తాబు చేస్తున్న హను…ఆ సినిమా విషయంలో కాస్త తడబడుతున్నట్లుగా తెలుస్తుంది..ఎందుకంటే లై అంటే కమర్షియల్ ఫార్మ్యాట్ లో సాగే కధ కనుక భారీగానే ఖర్చు పెట్టించాడు హాను. కానీ ఇప్పుడు తాను చేస్తున్న పడి పడి లేచే మనసు మాత్రం సింపిల్, క్యూట్ లవ్ స్టోరీ. అయితే ఈ సినిమాకు కూడా కొన్ని భారీ యాక్షన్ సీన్స్ ను ప్లాన్ చేసి నిర్మాతతో భారీగానే ఖర్చు పెట్టించాడట. అయితే శార్వాకి ఒక 20 నుంచి 25 కోట్ల బడ్జెట్ అయితే సరిపోతుంది, కానీ ఈ సినిమాకు ఏకంగా నలబై కోట్ల వరకూ ఖర్చు పెట్టించినట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్న మాట.
అయితే యాక్షన్ సినిమా అయినా, సింపిల్ లవ్ స్టోరీ అయినా ఎక్కడ వెనకాడను అంటున్నాడు సదరు దర్శకుడు. మరి చిన్న హీరోలు లాంటి శర్వకి అంత బడ్జెట్ అంటే భారీగా హిట్ అయితే తప్పితే నిర్మాత సేఫ్ జోన్ లోకి వెళ్ళడు. అయితే సినిమా సక్సెస్ అయితే పర్వాలేదు కానీ…ఏమాత్రం తేడా వచ్చినా నిర్మాతకు ఇబ్బందులు తప్పవు…మరి దర్శకులు ప్రొడక్షన్ మ్యానేజ్మెంట్ సరిగ్గా చేసుకోక పోతే, నిర్మాతకు చివరకు ఏమీ మిగలదు.



