ఈ సంక్రాంతి సినిమాలో ‘మిస్’ అయిన ‘కిక్’ అది!

Shatamanam Bhavati - 50 Days Celebrationsఈ ఏడాది ఎన్నడూ లేని విధంగా మూడు సక్సెస్ ఫుల్ సినిమాలతో సంక్రాంతి పండగ ఓపెన్ అయ్యింది. రెండు పెద్ద సినిమాలైన “ఖైదీ నంబర్ 150, గౌతమీపుత్ర శాతకర్ణి”లు బాక్సాఫీస్ వద్ద కనకవర్షం కురిపించగా, వాటితో పాటు విడుదలైన శర్వానంద్ సినిమా “శతమానం భవతి” కూడా విజయవంతంగా 50 రోజులను పూర్తి చేసుకుంది. ఇటీవలే చిరు, బాలయ్య సినిమాలు అర్ధశతదినోత్సవాలను జరుపుకోగా, తాజాగా శర్వా కూడా హాఫ్ సెంచరీ పూర్తి చేసాడు. దీనికి సంబంధించి చిత్ర యూనిట్ ఓ అధికారిక పోస్టర్ ను కూడా విడుదల చేసింది.

అయితే ఈ పోస్టర్ లో ప్రేక్షకులకు కావాల్సిన కిక్ మిస్ అయ్యిందని చెప్పవచ్చు. ఇటీవల కాలంలో సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందనే దానికి కొలమానంగా చిత్ర కలెక్షన్స్ ను చెప్తుంటారు. ఈ కోవలోనే ‘ఖైదీ’ 100 కోట్లు కొట్టిందని నాగబాబు తదితరుల ద్వారా నిర్మాణ సంస్థ పరోక్షంగా చెప్పించగా, బాలయ్య సినిమాకు సంబంధించి 50 రోజుల పోస్టర్ లో 77 కోట్లుగా తేల్చిచెప్పారు. కానీ, ‘శతమానం భవతి’ పోస్టర్ లో మాత్రం ఆ కలెక్షన్స్ ‘కిక్’ మిస్ అయ్యిందని చెప్పవచ్చు.

ADVERTISEMENT

అయితే పెద్ద హీరోల సినిమాల కలెక్షన్స్ కు సంబంధించిన వివరాలపై చూపించే ఆసక్తి, శర్వానంద్ వంటి హీరోల సినిమా కలెక్షన్స్ పై ప్రేక్షకులకు ఉండకపోయినా, రెండు పెద్ద చిత్రాల నడుమ విడుదలై, ఎంత కొల్లగొట్టిందో చెప్తే, అది శర్వానంద్ రేంజ్ ను పెంచే విధంగా ఉంటాయని చెప్పవచ్చు. అధికారిక లెక్కలు తెలియనప్పటికీ, ఈ సినిమా పంపిణీ దారులకు భారీ లాభాలను తెచ్చిపెట్టిందని సమాచారం. అనధికారిక సినీ వర్గాల టాక్ ప్రకారం 30 కోట్లు పైనే షేర్ అందుకుందని, యుఎస్ లో మాత్రం 1 మిలియన్ మార్క్ కు మరో 2.20 లక్షల డాలర్స్ కు దూరంగా నిలిచిందని తెలుస్తోంది.

ADVERTISEMENT
Latest Stories