తన సినిమా రిలీజ్ ప్రమోషన్స్ లో భాగంగా ఈ మధ్య కాలంలో నటుడు శివాజీ చేస్తున్న కొన్ని వ్యాఖ్యలు ఎవరోకరికి మంట పుట్టుస్తున్నాయి. వారి మద్దతుదారులకు బీపీలు తెప్పిస్తున్నాయి.
అయితే మొన్నీమధ్య దండోరా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో హీరోహీన్స్ డ్రస్సింగ్స్ పై శివాజీ చేసిన అనుచిత వ్యాఖ్యల పై అటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఇటు సోషల్ మీడియాలో పెద్ద దుమారమే లేచింది.
శివాజీ వ్యాఖ్యలను తప్పుబడుతూ కొందరు శివాజీ వ్యాఖ్యలకు సమర్థిస్తూ మరి కొందరు ఇలా ఆయన చేసిన వ్యాఖ్యల పై ఉప్పు – నిప్పు స్థాయిలో మంటలు చెలరేగాయి. అయితే ఆ మంటలలో సినీ సెలబ్రెటీలు సైతం చిక్కుకున్నారు. అయితే ఇక ఇప్పుడు శివాజీ – లయ కలిసి నటిస్తున్న సంప్రదాయని సుప్పిని సుద్దపూసని చిత్రం ఈ నెల 6 న థియేటర్ లలో విడుదలయ్యింది.
అయితే ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఆయన ఇచ్చిన ఒక ఇంటర్ వ్యూ లో ఏపీ రాష్ట్ర రాజధాని అమరావతి పై శివాజీ చేసిన వ్యాఖ్యలు ఈ సారి వైసీపీ అభిమనులలో మంట పుట్టించాయి. అమరావతి అనేది ఆ ప్రాంత రైతుల త్యాగ ఫలం, ఆ త్యాగం రియల్ ఎస్టేట్ బాగు కోసం కాదు 7 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం, వారి భావితరాల కోసం అంటూ అమరావతిని దుబాయ్ కి ఉదహరిస్తూ వ్యాఖ్యానించారు.
అయితే అసలు అమరావతి అనేది వైసీపీ కి ఎప్పటికి మిగుడుపడని ఒక బ్రహ్మ పదార్ధం. అటువంటి బ్రహ్మ పదార్ధాన్ని నటుడు శివాజీ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అంటూ కొనియాడుతుంటే వైసీపీ కి మండదా.? సోషల్ మీడియాలో కొంతమంది వైసీపీ మద్దతుదారులు, జగన్ అభిమానులు ఆయనతో పాటుగా ఆయన సినిమాను కూడా టార్గెట్ చేస్తూ కామెంట్స్ పెడుతున్నారంటూ శివాజీ చేసిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
వైసీపీ పేటిఎమ్ బ్యాచ్ తనను అనవసరంగా కెలికారని, అమరావతి పై మాట్లాడే హక్కు తనకుందని, అది ఏ ప్రభుత్వమైనా అక్కడి ప్రాంత రైతులకు అన్యాయం చేస్తే ఆ ప్రభుత్వాన్ని, ఆ ప్రభుత్వ పెద్దలను నిలదీస్తానని, అవసరమైతే విమర్శిస్తానంటూ శివాజీ వీడియోలో వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులకు ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.
రాజకీయాలను పక్కన పెట్టి ఇప్పటి వరకు నా సినిమాలేవో నేను చేసుకుంటే ఈ వైసీపీ పేటిఎమ్ బ్యాచ్ తనను తగులుకున్నారని, అది వారి పార్టీ అధినేత జగన్ కే ప్రమాదమని, వద్దు గురు నా జోలికి రావొద్దు అంటూనే ఇక నుంచి ఈ విషయం పై మాట్లాడుకుందాం అంటూ జగన్ సిబిఐ కేసుల వరకు విషయాన్ని పొడిగించారు శివాజీ.
మరి ఇప్పుడు ఈ వివాదం చిలికి చిలికి ఎవరికీ ప్రమాదంగా మారుతుందో.? అలాగే ఈ వీడియో పై మీడియాలో ఎన్ని డిబేట్లు జరగనున్నాయో, దాని ద్వారా ఈ వివాదం రానున్న రోజులలో ఏపీ రాజకీయాలలో ఇంకెంత మరగనుందో, అలాగే సోషల్ మీడియాలో ఎటువంటి చర్చలకు దారి తీయనుందో చూడాలి..!
.@ActorSivaji back in aggressive mode!
“మీలాగా Paytm బ్యాచ్ కాదు నేను.
జగన్ గారు, నాకు రాజకీయాలు వద్దు.
Paytm బ్యాచ్ నన్ను తగులుకుందామనుకుంటే మీ వాడికే ప్రమాదం.
వద్దు గురు… నా జోలికి రావద్దు.” #Sivaji #YSRCP pic.twitter.com/LuSJGF6mvh
— M9 NEWS (@M9News_) March 8, 2026




