వైయస్ మేనత్త కొడుకు ఇచ్చిన జలక్ తో జగన్ షాక్!

Shock to gajanఏపీలో ప్రతిపక్ష పార్టీ నుండి అధికార పక్షంలోకి వలసలు కొనసాగుతున్నాయి. ఇప్పటిదాకా తన పార్టీ టికెట్లపై విజయం సాధించిన ఎమ్మెల్యేలు టీడీపీలో చేరి వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఝలకివ్వగా, తాజాగా ఆయన సమీప బంధువుల నుంచి కూడా షాకులు ఎదురు అవుతుండడంతో వైసీపీ మనుగడపై వస్తున్న ప్రశ్నలు క్రమంగా తన బలం పెంచుకుంటోంది.

ADVERTISEMENT

దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మేనత్త కొడుకు, కడప కార్పొరేషన్ లోని 23వ వార్డు కార్పొరేటర్ అయిన పీటర్ జగన్ కు షాకిచ్చే నిర్ణయం తీసుకున్నారు. నిన్న హైదరాబాదు విచ్చేసిన పీటర్, టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సమక్షంలో ‘సైకిల్’ ఎక్కారు. వైఎస్ మేనత్త కొడుకే తన పార్టీలోకి చేరుతుండటంతో చంద్రబాబు స్వయంగా పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానం పలికారు.

ADVERTISEMENT
Latest Stories