వివాదం’లో యూ ట్యూబ్ ‘హాట్’ హీరోయిన్ ‘వివాహం’

Siri Priya, Siri Priya Controversy, Siri Priya Marriage Controversy, Actress Siri Priya Marriage Controversy, YouTube Actress Siri Priya Marriage Controversy, Short Film Actress Siri Priya Marriage Controversy, Siri Priya Wedding Controversyరీల్ లైఫ్ లో నటించిన పలు రొమాంటిక్ షార్ట్ ఫిల్మ్స్ ప్రస్తుతం ఆమె రియల్ జీవితానికి శాపం అయ్యాయి. షార్ట్ ఫిల్మ్స్ పేరిట హాట్ హాట్ సన్నివేశాలలో నటించే శ్రీప్రియ యూ ట్యూబ్ ప్రేక్షకులకు సుపరిచితమే. రీల్ లైఫ్ పరిస్థితి ఇలా ఉంటే, ఫేస్ బుక్ లో జరిపిన ప్రేమాయణం రియల్ లైఫ్ లో ఈ నెల 9వ తేదీన పెళ్లిగా మారింది. ప్రసన్న కుమార్ అనే బిటెక్ విద్యార్ధితో జరిగిన ఈ వివాహంపై పెళ్లికొడుకు తరపున వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేయడంతో, ఈ కధ వివాదాస్పదంగా మారింది.

దీనికి గల ప్రధాన కారణం… తనకు బ్యాక్ గ్రౌండ్ లో ఉన్నటువంటి రొమాంటిక్ షార్ట్ ఫిల్మ్స్ అని శ్రీప్రియ చెప్తోంది. తన పొట్ట కూటి కోసం కొన్ని చిత్రాలలో నటించిన మాట వాస్తవమేనని, అయితే ప్రసన్న బంధువులు ఆరోపిస్తున్నట్లుగా నేను ‘అలాంటి’ దానిని కాదని, త్వరలోనే మరో రంగంలో సెటిల్ అవుతానని చెప్పుకొచ్చింది. తానూ ప్రసన్న కుమార్ ను కావాలనే వలలో వేసుకున్నట్లు వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని, తమ ఇద్దరికీ ఎలాంటి హాని తలపెట్టకుండా ఉంటే చాలని, ఆ ప్రాణభయంతోనే పోలీస్ స్టేషన్ వరకు రావాల్సిన పరిస్థితి తలెత్తిందని తెలిపింది.

ADVERTISEMENT

తన క్యారెక్టర్ పై ప్రసన్న వర్గీయులు వ్యక్తపరుస్తున్న అనుమానాలను తానే నివృత్తి చేస్తానని, అయితే తనకు కొంత సమయం కావాలని కోరింది. యూ ట్యూబ్ లో శ్రీప్రియగా పరిచయం అయినప్పటికీ తన అసలు పేరు చంద్రకళ అని చెప్పింది. ప్రస్తుతం ఒక తెలుగు సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నానని, త్వరలోనే విడుదల కానుందని తెలిపింది. ప్రసన్న కుమార్ కుటుంబం నుండి తమకు రక్షణ కావాలని తూర్పుగోదావరి జిల్లా, రాజానగరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు ఈ జంట.

ADVERTISEMENT
Latest Stories